7th Pay Commission central govt to hike fitment factor to employees
7th Pay Commission : ఇటీవల పలు రాష్ట్రాలు డీఏలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులని ఆనందింపజేసే పనిలో పడింది. కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచే ఆలోచనలో ఉండగా, ఇప్పుడు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్ ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది. కేంద్ర ఉద్యోగులకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ చెల్లించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
భారీ పెంపు…
34 శాతం కరువు భత్యం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి దక్కనుండగా, దీని వల్ల రాష్ట్రంలోని 7.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని, రాష్ట్ర ఖజానాపై రూ.625 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 31 శాతం కరువు భత్యం ఉండేదని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్‌లో లభించే డియర్‌నెస్ అలవెన్స్‌ను ఆగస్టు నెల నుంచి వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పెన్షనర్లు కూడా కరువు భత్యం ప్రయోజనం పొందుతారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డియర్‌నెస్ అలవెన్స్‌ను 11 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
7th pay commission increases in august
అయితే రానున్న కొద్ది రోజుల్లో కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను కూడా 38 నుంచి 39 శాతానికి పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరువు భత్యం పెంపుపై మోదీ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పెంచిన డీఏ ఈనెల నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు నెల నుండి అమలులోకి రానుండగా, ఇది సెప్టెంబర్‌లో ఉద్యోగులకు అందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. మొత్తానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల డీఏ పెంచే ఆలోచనలు చేస్తుండగా, ఉద్యోగులు చాలా సంతోషిస్తున్నారు.
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
This website uses cookies.