#image_title
Navratri 2025 | శరన్నవరాత్రి వేడుకల సందడి మొదలైంది. తొమ్మిది రోజుల పాటు అమ్మ దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తులు ఆరాధిస్తారు. ప్రతి రోజుకి ప్రత్యేకత ఉండగా, అమ్మవారి ప్రతి రూపానికి ఇష్టమైన పువ్వును సమర్పించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. భక్తులు అమ్మవారికి నైవేద్యంతో పాటు ఆ రోజుకు తగిన పువ్వును సమర్పిస్తే, అదృష్టం, ఆరోగ్యం, శ్రేయస్సు, శాంతి ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
#image_title
తొమ్మిది రోజులలో తొమ్మిది పువ్వులు:
మొదటి రోజు – శైలపుత్రి : తెల్లటి కమలం లేదా తెల్లటి పువ్వులు. శాంతి, స్థిరత్వం లభిస్తాయి.
రెండవ రోజు – బ్రహ్మచారిణి : గులాబీలు, మల్లె. భక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
మూడవ రోజు – చంద్రఘంట : బంతి పువ్వులు. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
నాల్గవ రోజు – కూష్మాండ దేవి : ఎర్ర మందార. ఆరోగ్యం, దీర్ఘాయువు ప్రసాదిస్తుంది.
ఐదవ రోజు – స్కందమాత : కమల పువ్వు. ఇంటికి, పిల్లలకు శ్రేయస్సు కలుగుతుంది.
ఆరవ రోజు – కాత్యాయనీ : కదంబ పువ్వు. వివాహం, కుటుంబ ఆనందం లభిస్తాయి.
ఏడవ రోజు – కాళరాత్రి : మల్లి, నీలి తామర, మందార. ప్రతికూల శక్తి, భయం తొలగిపోతాయి.
ఎనిమిదవ రోజు – మహాగౌరి : తెల్లని మల్లె, గులాబీ. అందం, ఆనందం, సంతృప్తి కలుగుతాయి.
తొమ్మిదవ రోజు – సిద్ధిదాత్రి : నీలి కమలం లేదా మల్లె. విజయం, జ్ఞానం ప్రసాదిస్తుంది.
ఈ తొమ్మిది రోజులలో అమ్మవారికి ఇష్టమైన పువ్వులను సమర్పించడం ద్వారా భక్తులు కష్టాల నుంచి విముక్తి పొంది, సంపద, ఆరోగ్యం, విజయాలను పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. నవరాత్రి సందర్భంగా భక్తులు రంగుల దుస్తులు ధరించి, నైవేద్యం సమర్పించి, ఈ పువ్వులతో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారి కృపకు పాత్రులు అవుతున్నారు.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.