Home » Exclusive » A Hen Laid 30 Eggs In 10 Hours In Uttarakhand
Exclusive

Hen : ఉత్తరాఖండ్ లో వింతైన సంఘటన.. 10 గంటలలో 30 గుడ్లు పెట్టిన కోడి..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: December 29, 2022, 1:20 pm
Advertisement

Hen : కోడి సాధారణంగా రోజుకి ఎన్ని గుడ్లు పెడుతుంది ఒకటి లేదా రెండు. అంతకుమించి గుడ్లు పెట్టడం అనేది ఎక్కడ కూడా జరగదు. కానీ ఉత్తరాఖండ్ లో అల్మోరా జిల్లాలో… బాసోత్ గ్రామంలో నివాసం ఉంటున్న గిరీష్ చంద్ర ఇంటిలో ఓ కోడి ఉంది. అది రోజుకి రెండు గుడ్లు స్టార్టింగ్ లో పెట్టేది. కానీ ఇటీవల డిసెంబర్ 25వ తారీఖున కోడి వరుసగా గుడ్లు పెడుతూనే ఉంది.

Advertisement

గిరీష్ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి… 31 గుడ్లు పెట్టింది. కేవలం 10 గంటల వ్యవధిలో కోడి 31 గుడ్లు పెట్టడంతో.. చుట్టుపక్క స్థానికులు ఈ వింత చూడటానికి గిరీష్ ఇంటికి క్యూ కట్టారు. గిరీష్ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. టూర్ అండ్ ట్రావెల్స్ సంస్థలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆ కోడికి రోజు 200 గ్రాములు వేరుశెనగ గింజలు మేత వేస్తున్నట్లు

A hen laid 30 eggs in 10 hours in Uttarakhand

Advertisement

వాటితో పాటు వెల్లుల్లి కూడా పెడతామని తెలిపారు. రోజు ఒక గుడ్డు పెట్టేది. ఆ తర్వాత రెండు గుడ్లు పెడుతుంది. కానీ డిసెంబర్ 25వ తారీకు మాత్రం ఏకంగా 31 గుడ్లు పెట్టింది. ఇది ఎలా జరిగిందో తెలియదు. దీంతో ఈ వార్త బాగా వైరల్ కావడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు గిరీష్ ఇంటిలో కోడిని పరిశీలించడానికి బృందాలుగా వచ్చారు. ఈ క్రమంలో గుడ్లు పెట్టిన కోడిని తీసుకుని పరిశీలిస్తామని. తీసుకెళ్లడం జరిగిందట.

 

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి