a love story of two grls in uttar pradesh
Love Story : ప్రస్తుత రోజుల్లో బయట రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నయి. ముఖ్యంగా యువతీ యువకుల మధ్య దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రేమించిన అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికిన ఉదాంతం ఇటీవల అందరిని భయభ్రాంతులకు గురి చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరో విచిత్రమైన సంఘటన ఓ ప్రేమికుల జంట మధ్య చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీజిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ శ్రీవాత్సవ అనే ఇద్దరమ్మాయిలు ఎప్పటినుంచో స్నేహితులు. అయితే వీరి స్నేహం రానురాను ప్రేమగా మారడంతో 2017లో వివాహం చేసుకున్నారు. అయితే వివాహ ఒప్పందం ప్రకారం వీరిద్దరిలో ఒకరు మగవారిగా మారాలి.
దీంతో సనా ఖాన్ … ఢిల్లీలో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా మగవాడిగా మారింది. ఈ క్రమంలో సోనాల్ కీ ఓ హాస్పిటల్ లో ఉద్యోగం రావడం జరిగింది. అయితే అదే హాస్పిటల్ లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడి సోనాల్ ప్రేమలో పడటం జరిగింది. దీంతో సనా ఖాన్ నీ నిర్లక్ష్యం చేయటం మాత్రమే కాదు.. అతడితో గొడవలు పెట్టుకుని పూర్తిగా పక్కకు పెట్టింది. దీంతో ప్రతిఘటించిన సనా ఖాన్…సోనాల్ నీ నిలదీయడం జరిగింది. కోపంతో ఊగిపోయిన సోనాల్.. నేను నీతో కలిసి ఉండడం నా వల్ల కావడం లేదని, నువ్వు మళ్లీ అమ్మాయిగా
a love story of two grls in uttar pradesh
మారిపో అని ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో సనా ఖాన్.. తీరా అవమానానికి గురై మనస్థాపంతో ఏం చేయాలో తెలియక గత ఏడాది మే నెలలో కోర్టునీ ఆశ్రయించడం జరిగింది. వెంటనే కోర్టు…సోనాల్ కీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయినా కానీ ఆమె స్పందించకపోవడంతో పోలీసుల సాయంతో ఆమెను న్యాయస్థానంలో హాజరు పరిచారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 23వ తారీకుకి న్యాయస్థానం వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలో సనా ఖాన్ కీ న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు చాలా సస్పెన్స్ గా మారింది. ఇటువంటి అరుదైన ఘటనలో కోర్టు తీర్పు ఎలా ఇస్తుందో.. అనేది కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.