Wolf : 18లక్షలు పెట్టి మనిషి తోడేలు గా మారిపోయాడు .. కారణం తెలిస్తే ” ఒరేయ్ పిచ్చి వెధవా ” అంటారు మీరు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wolf : 18లక్షలు పెట్టి మనిషి తోడేలు గా మారిపోయాడు .. కారణం తెలిస్తే ” ఒరేయ్ పిచ్చి వెధవా ” అంటారు మీరు..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 January 2023,5:20 pm

Wolf : ఈ రోజుల్లో జనాలు చేష్టలు మరి వింతగా తయారవుతున్నాయి. ఒక్కోసారి వాళ్లకు పిచ్చి పట్టిందా అని అనిపిస్తుంటుంది. మనిషికి రోజురోజుకీ తెలివితేటలు మితిమీరి పోతున్నాయి. అది తెలివి అనుకోవాలా వెర్రి అనుకోవాలా అర్థం కావట్లేదు. అసలు వివరాల్లోకెళితే జపాన్ కి చెందిన ఒక వ్యక్తి 18 లక్షలు ఖర్చుపెట్టి తనని తాను తోడేలుగా మార్చుకున్నాడు. ఇతను కొద్దిరోజుల క్రితం జెప్పెట్ అనే కంపెనీని సంప్రదించి తనకు తోడేలు లా ఉండే ఓ కాస్ట్యూమ్ తయారుచేసి ఇవ్వమన్నాడు.

దీంతో వారు హైపర్ రియాలిస్టిక్ టెక్నాలజీతో తోడేలు తొడుగులను తయారుచేసి ఇచ్చారు. దీనికి ఆ వ్యక్తి 18 లక్షల రూపాయలను చెల్లించాడు. దాదాపుగా 50 రోజులపాటు కష్టపడి దీనిని తయారు చేశారు. ఆ వ్యక్తి తోడేలు తొడుగు తన చేతిలోకి రాగానే సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతిరోజు దాన్ని వేసుకుని తిరుగుతూ తెగ సంబరపడిపోతున్నాడు. చూసిన జనం ఎందుకు నువ్వు ఇలా తోడేలు తొడుగు ధరించి తిరుగుతున్నావని అడిగారు.

a man look like wolf spends 18 lakhs

a man look like wolf spends 18 lakhs

దానికి బదులుగా అతడు నాకు చిన్నప్పటి నుంచి జంతువులు అంటే ఇష్టం. టీవీలో హైపర్ రియలిస్టిక్ ట్ కాస్ట్యూమ్ ను చూసినప్పుడు నాకు ఇష్టం మొదలైంది. అలా నేను ఓ జంతువు కాస్ట్యూమ్ లో తిరగాలని కలలు కనే వాడిని అని చెప్పాడు. సోషల్ మీడియాలో తోడేలు తొడుగు వేసుకుని తిరుగుతున్న ఈ వ్యక్తి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తోడేలు లా కనిపించడానికి 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడా.. వీడికి ఏమైనా పిచ్చా అని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది