Wolf : ఈ రోజుల్లో జనాలు చేష్టలు మరి వింతగా తయారవుతున్నాయి. ఒక్కోసారి వాళ్లకు పిచ్చి పట్టిందా అని అనిపిస్తుంటుంది. మనిషికి రోజురోజుకీ తెలివితేటలు మితిమీరి పోతున్నాయి. అది తెలివి అనుకోవాలా వెర్రి అనుకోవాలా అర్థం కావట్లేదు. అసలు వివరాల్లోకెళితే జపాన్ కి చెందిన ఒక వ్యక్తి 18 లక్షలు ఖర్చుపెట్టి తనని తాను తోడేలుగా మార్చుకున్నాడు. ఇతను కొద్దిరోజుల క్రితం జెప్పెట్ అనే కంపెనీని సంప్రదించి తనకు తోడేలు లా ఉండే ఓ కాస్ట్యూమ్ తయారుచేసి ఇవ్వమన్నాడు.
దీంతో వారు హైపర్ రియాలిస్టిక్ టెక్నాలజీతో తోడేలు తొడుగులను తయారుచేసి ఇచ్చారు. దీనికి ఆ వ్యక్తి 18 లక్షల రూపాయలను చెల్లించాడు. దాదాపుగా 50 రోజులపాటు కష్టపడి దీనిని తయారు చేశారు. ఆ వ్యక్తి తోడేలు తొడుగు తన చేతిలోకి రాగానే సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతిరోజు దాన్ని వేసుకుని తిరుగుతూ తెగ సంబరపడిపోతున్నాడు. చూసిన జనం ఎందుకు నువ్వు ఇలా తోడేలు తొడుగు ధరించి తిరుగుతున్నావని అడిగారు.
దానికి బదులుగా అతడు నాకు చిన్నప్పటి నుంచి జంతువులు అంటే ఇష్టం. టీవీలో హైపర్ రియలిస్టిక్ ట్ కాస్ట్యూమ్ ను చూసినప్పుడు నాకు ఇష్టం మొదలైంది. అలా నేను ఓ జంతువు కాస్ట్యూమ్ లో తిరగాలని కలలు కనే వాడిని అని చెప్పాడు. సోషల్ మీడియాలో తోడేలు తొడుగు వేసుకుని తిరుగుతున్న ఈ వ్యక్తి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తోడేలు లా కనిపించడానికి 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడా.. వీడికి ఏమైనా పిచ్చా అని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.