Viral Video : ఐదు పెళ్లిళ్లు చేసుకున్న వ్య‌క్తి.. పోలీసుల‌ను ఆశ్ర‌యించిన నాలుగో భార్య‌

 Authored By mallesh | The Telugu News | Updated on :30 May 2022,9:00 pm

Viral Video : డ‌బ్బుల కోసం కొంత‌మంది అమ‌యాకుల‌ను ఆస‌రాగా చేసుకుని మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. అమ్మాయిల‌తో ప‌లు సైట్ల ద్వారా పరిచ‌యం పెంచుకుంటున్నారు. మాయ‌మాట‌లు చెప్పి క‌ట్న కానుక‌లు తీసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. తీరా మోజు తీర‌క మొహం చాటేస్తున్నారు. ఇలా నిత్యం ఎక్క‌డో ఒక‌చోట జ‌రుగుతూనే ఉన్నాయి.ఇలా నాలుగైదు పెళ్లి చేసుకుంటూ మోసం చేస్తూ ప‌రారీలో ఉంటున్నారు. ఇలా ఓ నిత్య‌పెళ్లి కొడుకు ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రిని ఇలా ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు. కాగా కో యువ‌ని పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ చేసి వ‌దిలిపెట్టి మ‌రో పెళ్లి చేసుకోగా ఆ బాధితురాలు కంప్లేంట్ తో వెలుగులోకి వ‌చ్చాయి.

వ‌న‌ప‌ర్తి జిల్లా పాన్ గ‌ల్ మండ‌లం మంగ‌ళ్ల ప‌ల్లికి చెందిన స‌గ‌న‌మోని మ‌ద్దిలేటి అలియాస్ మ‌ధుతో గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేటకు చెందిన యువ‌తీ లీలీవిజ‌య‌దుర్గ‌తో మాట్రిమోని ద్వారా ప‌రిచ‌య‌మై పెళ్లి జ‌రిగింది. అయితే కొన్ని రోజులు బాగానే ఉన్న మ‌ధు విజ‌య‌దుర్గ‌ను ప్రెగ్నెంట్ చేసి పుట్టింట్లో వ‌దిలి వెళ్లాడు. కాగా ఎన్ని రోజులైనా తిరిగి రాక‌పోవ‌డంతో విజ‌య‌దుర్గ ఆరా తీసింది. చివ‌రకి పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌నిలో ఉన్న‌ట్లు తెలిసింది. ఆరునెలల క్రిత‌మే అక్క‌డే ఓ యువ‌తిని పెళ్లి చేసుకుని సెటిల‌య్యాడు. విష‌యం ఏంటంటే విజ‌య దుర్గ నాలుగో భార్య.. ఇప్పుడు చేసుకున్న యువ‌తి ఐదో భార్య‌.

a man with five marriages a fourth wife who resorted to the police

a man with five marriages a fourth wife who resorted to the police

ఇలా ఇదివ‌ర‌కే మ‌రో ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. విష‌యం తెలుసుకున్ విజ‌య దుర్గ పోలీసులను ఆశ్ర‌యించింది. మ‌ధు త‌న‌ను మ‌య మాట‌లు చెప్పి పెళ్లి చేసుకున్నాడ‌ని.. ప్రేమ‌గా చూపుకుంటాన‌ని చెప్పి న‌మ్మించి త‌న గ‌తం తెలియ‌కుండా చేసి పెళ్లి చేసుకున్నాడ‌ని వాపోయింది. కాగా పోలీసులు కేసు న‌మోదు చేసి ఎంక్వైరీ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=dsgVtNkvucQ&t=95s

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి