Alasanda Garelu Recipe : కరకరలాడే బెస్ట్ స్నాక్ అలసందల గారెలు… చిన్నపిల్లల, పెద్దవాళ్లు అందరూ ఇష్టంగా తింటారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Alasanda Garelu Recipe : కరకరలాడే బెస్ట్ స్నాక్ అలసందల గారెలు… చిన్నపిల్లల, పెద్దవాళ్లు అందరూ ఇష్టంగా తింటారు…!

Alasanda Garelu Recipe : సాయంత్రం అయిందంటే చాలు అందరికీ స్నాక్స్ తినాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో అందరూ బజ్జిలు, పకోడీ, చిట్టి బోండా, ఇలా గారెలు వెరైటీగా తింటూ ఉంటారు. గారెలు అంటే పచ్చిశనగపప్పు ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం అలసందలతో గారెలు చేయబోతున్నాం. ఇవి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈ అలసంద గారెలు ఎలా తయారు చేయాలో చేద్దాం… ఈ అలసందల గారెలు కోసం కావాల్సిన […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 October 2022,7:30 am

Alasanda Garelu Recipe : సాయంత్రం అయిందంటే చాలు అందరికీ స్నాక్స్ తినాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో అందరూ బజ్జిలు, పకోడీ, చిట్టి బోండా, ఇలా గారెలు వెరైటీగా తింటూ ఉంటారు. గారెలు అంటే పచ్చిశనగపప్పు ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం అలసందలతో గారెలు చేయబోతున్నాం. ఇవి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈ అలసంద గారెలు ఎలా తయారు చేయాలో చేద్దాం… ఈ అలసందల గారెలు కోసం కావాల్సిన పదార్థాలు: అలసందలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉప్పు, ఆయిల్ మొదలైనవి..

అలసంద గారెలు తయారీ విధానం: ముందుగా ఆఫ్ కేజీ అలసిందలను తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వడేసుకోవాలి. ఈ అలసందలు నీళ్లన్నీ ఓడిసిన తర్వాత ఈ పప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లో వేసి వడ పిండిలా పట్టుకోవాలి. తర్వాత ఆ పిండిలో ఒక కప్పు ఉల్లిపాయలు, అరకప్పు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి ,కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని తరువాత ఒక తడి బట్టని తీసుకొని దానిపై ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఆ తడి బట్టపై పెట్టి రౌండ్ గా చేసి మధ్యలో హోల్ ని పెట్టి అన్నీ చేసి ఉంచుకోవాలి.

Alasanda Garelu Recipe in Telugu

Alasanda Garelu Recipe in Telugu

తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కి సరిపడనంత ఆయిల్ పోసుకొని అది హీటెక్కిన తర్వాత ఆ గారెలను ఒక్కొక్కటిగా వేయించుకొని తీసుకోవాలి. అంతే అలసంద గారెలు రెడీ. ఈ గారెలు వాటి పైన పొడి కారం చల్లుకొని దాని పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని తింటుంటే రుచి వేరే లెవెల్ లో ఉంటుంది. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టంగా తింటుంటారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది