Alcohol | విస్కీలో నీళ్లు ఇలా క‌లిపితే.. ఆ కిక్కు వేరేలా ఉంటుంద‌ట‌…!

Authored By Sam C | The Telugu News | Published on: August 30, 2025, 7:00 am

Alcohol | మందు ప్రియులందరికీ ఒకేలా అభిరుచి ఉండదు. ఒకరు స్ట్రైట్ విస్కీని ఇష్టపడతారు, మరొకరు నీటితో కలిపి తాగుతారు, ఇంకొందరు ఐస్ వేస్తారు. అయితే సైన్స్ ప్రకారం, విస్కీకి కొద్దిగా నీరు కలపడం వల్ల దాని రుచి మరింత మెరుగవుతుంది. ఇటీవల స్వీడన్‌ లో జరిగిన ఒక అధ్యయనంలో, విస్కీని 20 శాతం ABV (Alcohol By Volume) వరకూ నీటితో కలపడం వల్ల దాని రుచి, వాసన మరింతగా బయటపడుతుందని తేలింది. అంటే సుమారుగా సగం విస్కీ – సగం నీరు నిష్పత్తిలో కలిపితే, మంచి అనుభూతిని కలిగిస్తుందన్నమాట.

#image_title

ఇలా చేయండి..!

అదే విషయాన్ని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులూ ధృవీకరించారు. వారి అధ్యయనాల ప్రకారం, నీరు జోడించడంలో ఒక హద్దు ఉండాలి. ఎక్కువగా కలిపితే విస్కీలోని సున్నితమైన రుచి భాగాలు కలిసి పోతాయి. 60 మిల్లీలీటర్ల విస్కీకి గరిష్టంగా 12 మిల్లీలీటర్ల నీటిని మాత్రమే కలపడం మంచిదని సూచించారు. అంటే ఇది సుమారు 20% నీటి మోతాదుని సూచిస్తుంది.

ఐస్ కలపడం కొంత మందికి అభిరుచి విషయంలో ప్రాధాన్యం కలిగి ఉన్నా, ఇది కాస్త వివాదాస్పద అంశం కూడా. చలికాలాల్లో లేదా చల్లటి వాతావరణాల్లో ఐస్ తాగేవారికి అంతగా అవసరం ఉండకపోవచ్చు. కానీ వేడి వాతావరణంలో, ఉదాహరణకు మనదేశంలో, కొంచెం ఐస్ వేసుకోవడం సహజమే. ఇది ఆల్కహాల్ వేడి ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

Sam C

No bio available for this author.

Tags :
    1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

    2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

    3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

    4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

    5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

    6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

    7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp