Allu Arjun : 600 కోట్ల బడ్జెట్.. అల్లు అర్జున్ కి 250 కోట్లు.. ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్..!
ప్రధానాంశాలు:
Allu Arjun : 600 కోట్ల బడ్జెట్.. అల్లు అర్జున్ కి 250 కోట్లు.. ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్..!
Allu Arjun : ఐకాన్ అల్లు అర్జున్ Allu arjun తన నెక్స్ట్ సినిమా అట్లీతో చేస్తాడన్న న్యూస్ తెలిసిందే. పుష్ప 2 తో నేషనల్ లెవెల్ లో తన సత్తా చాటి బాక్సాఫీస్ షేర్ గా నిలిచిన అల్లు అర్జున్ అట్లీ సినిమాతో కూడా అదరగొట్టే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ గురించి లేటెస్ట్ గా ఒక లీక్ బయటకు వచ్చింది. పుష్ప 2 తో 1800 కోట్ల పైన వసూళ్లను రాబట్టిన అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా బడ్జెట్ ని కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.అల్లు అర్జున్ అట్లీ కలిసి చేసే సినిమా బడ్జెట్ 500 కోట్ల నుంచి 600 కోట్ల దాకా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ రేంజ్ బడ్జెట్ అంటే ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరోసారి ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి మాస్ ఫీస్ట్ అందించేలా ఈ సినిమా రాబోతుంది. ఐతే 600 కోట్ల బడ్జెట్ లో అల్లు అర్జున్, అట్లీ రెమ్యునరేషన్స్ కూడా భారీగా ఉండబోతాయని తెలుస్తుంది. అల్లు అర్జున్ కి 250 కోట్లు, అట్లీకి 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది.

Allu Arjun : 600 కోట్ల బడ్జెట్.. అల్లు అర్జున్ కి 250 కోట్లు.. ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్..!
Allu Arjun : అల్లు అర్జున్ కి 250 కోట్లు..
అల్లు అర్జున్ కి 250 కోట్లు అనగానే ఆడియన్స్ ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఇన్నాళ్లు మన తెలుగు హీరోల్లో ప్రభాస్ ఒక్కడే 100, 200 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని అనుకున్నారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాకు 250 కోట్ల దాకా పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా అంచనాలను మించి ఉండేలా ఉంటుందని చెప్పొచ్చు.
పుష్ప 2 తో పాన్ ఇండియా క్రేజ్ పాపులారిటీ సంపాదించిన అల్లు అర్జున్ రాబోతున్న సినిమాలన్నీ కూడా నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో అట్లీ అల్లు అర్జున్ ఇద్దరు కూడా భారీ ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ అట్లీ ఈ కాంబో సినిమా ఎలాంటి సంచలనాలు అందిస్తుందో అన్నది చూడాలి. Allu Arjun, Atlee, Pushpa 2, Jawan, Bollywood