Allu Family | అల్లు ఫ్యామిలీకి మ‌రో ఝ‌ల‌క్.. ఈ సారి ఏకంగా ఇల్లే కూల్చేయ‌బోతున్నారా?

Authored By Sam C | The Telugu News | Updated on : 9 September 2025, 1:00 pm

Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 ప్రాంతంలో నిర్మించిన ఈ భవనంపై GHMC (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

#image_title

నిబంధనలు అతిక్రమ‌ణ‌

GHMC టౌన్ ప్లానింగ్ విభాగం వివరాల ప్రకారం, ఆ భవనానికి నాలుగు అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు మంజూరయ్యాయి. కానీ అనుమతులు లేని విధంగా పైభాగంలో పెంట్‌హౌస్‌ను అదనంగా నిర్మించారని అధికారులు గుర్తించారు. ఈ విషయం అధికారుల దృష్టికి రాగానే, వారు అక్కడ తనిఖీలు జరిపి అక్రమ నిర్మాణం స్పష్టమైందని ధృవీకరించారు.

ఈ నిర్మాణానికి బాధ్యత వహిస్తున్న అల్లు అరవింద్‌కు GHMC అధికారులు షోకాజ్ నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకు గాను ఈ చర్య తీసుకున్నట్లు GHMC వెల్లడించింది. నోటీసులో “ఎందుకు ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించకూడదో సమంజసమైన వివరణ ఇవ్వాలి” అని పేర్కొన్నారు. కేవలం కొన్ని రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టమైన గడువుతో నోటీసులు జారీ చేశారు.ఇటీవలే అల్లు అర్జున్ – సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ‘పుష్ప 2’ వివాదం చాలాచర్చకు లోనైంది. తాజాగా GHMC చర్యలు కొత్త మలుపు తిప్పాయి.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి