Black eyed peas | ఆరోగ్యానికి బొబ్బర్లు వరం ..ప్రతిరోజూ తింటే లాభాలే లాభాలు..!
Black eyed peas | సాధారణంగా మన వంటింట్లో దొరికే బొబ్బర్లు ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం అని పోషక నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ A, B1, B2, B3, B5, B6, C, ఫోలిక్ యాసిడ్‌తో పాటు రాగి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

#image_title
గర్భిణీలకు ప్రత్యేక ప్రయోజనం
ప్రతిరోజూ ఒక కప్పు బొబ్బర్లను నానబెట్టి ఉడికించి తింటే శరీరానికి కావాల్సిన పుష్కల పోషకాలు అందుతాయి. వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించి ఎక్కువసేపు ఆకలి రాకుండా చేస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకుంటారు, ఫలితంగా బరువు తగ్గుతారు.
బొబ్బర్లలో ఫోలేట్ అధికంగా ఉండటం వల్ల గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది గర్భంలో శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. బొబ్బర్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నాశనం చేసి, అంతర్గత వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ A, C తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచి మెరిసే, ఆరోగ్యవంతమైన చర్మాన్ని అందిస్తాయి.
జీర్ణశక్తి పెంపు
రోజూ ఒక కప్పు బొబ్బర్లు తింటే 194 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో మలబద్ధకం దూరమవుతుంది. మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.