Ambani Family : మొన్నటి వరకు పెళ్లి సంబరాల్లో ఉన్న అనంత్ అంబానీ..ఇప్పుడు వివాదంలో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ambani Family : మొన్నటి వరకు పెళ్లి సంబరాల్లో ఉన్న అనంత్ అంబానీ..ఇప్పుడు వివాదంలో..!

Ambani Family  : ప్రముఖ బిజినెస్ మెన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఎంత గ్రాండ్ గా జరిగాయో తెలిసిందే.. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ఇంకా బిజినెస్, క్రీడా ఇలా అన్ని రంగాల వారు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నిన్నటి వరకు కూడా దేశం మొత్తమే కాదు కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ పెళ్లి గురించే మాట్లాడుకోగా.. ఇప్పుడు ఓ వివాదం అనంత్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 July 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Ambani Family : మొన్నటి వరకు పెళ్లి సంబరాల్లో ఉన్న అనంత్ అంబానీ..ఇప్పుడు వివాదంలో..!

Ambani Family  : ప్రముఖ బిజినెస్ మెన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఎంత గ్రాండ్ గా జరిగాయో తెలిసిందే.. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ఇంకా బిజినెస్, క్రీడా ఇలా అన్ని రంగాల వారు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నిన్నటి వరకు కూడా దేశం మొత్తమే కాదు కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ పెళ్లి గురించే మాట్లాడుకోగా.. ఇప్పుడు ఓ వివాదం అనంత్ అంబానీ కుటుంబాన్ని వార్తల్లో నిలిచేలా చేసింది.

ప్రస్తుతం కాలంలో టెక్నలాజి ఒక రేంజ్ లో అభివృద్ధి చెందుతుందో తెలియంది కాదు.. సరికొత్తగా యాప్స్ అన్ని ఆశ్చర్య పరుస్తున్నాయి. అయితే ఈ యాప్స్ ను కొంతమంది చెడుకు వాడుకుంటున్నారు. ఆ చెడ్డ పనుల వల్ల చాలామంది ప్రముఖులు సమాజంలో తలెత్తుకోకుండా అవుతున్నారు. వారికి ప్రమేయం అసలు వారికి తెలియకుండానే ఇలాంటి పనులు చేస్తూ వారి వ్యక్తిగత హోదాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించుకొని నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. మొన్నటి వరకు సినీ తారలను ఎక్కువగా ఇందులోకి లాగగా ఇప్పుడు అంబానీ ఫ్యామిలీని లాగి వార్తల్లో నిలిచేలా చేసారు.

Ambani Family  గేమ్ యాప్ కి అనంత్ అంబానీ ప్రమోషన్ ఎలా..

ఈమధ్య కొన్ని సోషల్ మీడియా వేదికలలో అనంత్ అంబానీ ఓ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్టు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి అది ఫేక్ వీడియో అయినప్పటికీ.. డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి వీడియోను రూపొందించడంతో చూస్తే అది నిజమైన వీడియో లాగానే అనిపించింది. సేమ్ అనంత్ అంబానీ ముఖాన్ని, అతడి గొంతును సృష్టించారు. గేమింగ్ యాప్ ను అతడు ప్రమోట్ చేస్తున్నట్టు వీడియోను సృష్టించి.. సామాన్యుల జేబులను కొల్లగొట్టారు. అనంత్ అంబానీ పేరును ఉపయోగించుకొని.. డబ్బులు దోచుకుంటున్నారు. కేవలం అనంత్ అంబానీ మాత్రమే కాదు.. అతడి తల్లి నీతా అంబానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆదాని గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ లతో కూడా ఇలాంటి వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారితో కూడా గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయిస్తున్నట్టు వీడియోలను సృష్టించారు. పోలీసులకు ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో వారు సోషల్ మీడియా మీద ప్రధానంగా దృష్టి సారించారు.

Ambani Family మొన్నటి వరకు పెళ్లి సంబరాల్లో ఉన్న అనంత్ అంబానీఇప్పుడు వివాదంలో

Ambani Family : మొన్నటి వరకు పెళ్లి సంబరాల్లో ఉన్న అనంత్ అంబానీ..ఇప్పుడు వివాదంలో..!

సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న ఐడీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ వీడియోలు పెడుతున్న వ్యక్తులను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా త్వరలో గుర్తిస్తామని చెబుతున్నారు. ఈ తరహా మోసాలకు ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి గేమింగ్ యాప్ లు మోసపూరితమైనవే అని.. ప్రజలెవరూ అందులో బెట్టింగ్ కాయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది