Home » Entertainment » Anchor Rashmi In Bigg Boss 5 Telugu
Entertainment

Bigg boss 5 : బిగ్ బాస్ 5 లోకి యాంకర్ రష్మీ?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: June 12, 2021, 12:00 pm
Advertisement

Bigg boss 5 : బిగ్ బాస్ 5.. ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద ఇదే హాట్ టాపిక్. ఎప్పుడెప్పుడు ఈ షో ప్రారంభం అవుతుందా అని బిగ్ బాస్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఏ షోకు రానంత టీఆర్పీ రేటింగ్ బిగ్ బాస్ సొంతం అయింది. అందుకే.. బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ సీజన్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సీజన్ 4 మాత్రం సూపర్ సక్సెస్ అయింది. బుల్లితెర మీద ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ షో సీజన్ 5 కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

Advertisement

anchor rashmi in bigg boss 5 telugu

అయితే.. బిగ్ బాస్ సీజన్ 5 లో ఏ కంటెస్టెంట్లు ఉంటారు.. అనేదానిపై సస్పెన్స్ నెలకొన్నది. ఇప్పటికే బిగ్ బాస్ 5 లో సెలెక్ట్ అయిన వాళ్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా.. వాటిలో నిజం ఎంత? అంటే చెప్పడం కష్టం. బిగ్ బాస్ లో రావాలని ఆశపడని సెలబ్రిటీ ఉండరు. ఎందుకంటే.. బిగ్ బాస్ లోకి వచ్చారంటే.. వాళ్లు బిగ్ సెలబ్రిటీ అయిపోతారు. ఆఫర్లు కూడా వెల్లువలా వస్తుంటాయి. అందుకే.. చాలామంది బిగ్ బాస్ సీజన్ 5 లో ఉండటానికి తెగ ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Bigg boss 5 : బిగ్ బాస్ 3 లో యాంకర్ శ్రీముఖి.. బిగ్ బాస్ 5 లో యాంకర్ రష్మీ?

బిగ్ బాస్ లోకి పలు రంగాల్లో ఉన్న సెలబ్రిటీలను ఎంపిక చేస్తారు. సినిమా ఫీల్డ్ లో ఉన్నవాళ్లను, మీడియా ఫీల్డ్ లో ఉన్నవాళ్లను, సీరియల్స్ లో ఉన్నవాళ్లను, యాంకరింగ్ చేసేవాళ్లను.. ఇలా వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్లను ఒకే చోట చేర్చుతారు. బిగ్ బాస్ 3 లో యాంకర్ శ్రీముఖిని తీసుకున్న విషయం తెలిసిందే. జస్ట్ లో యాంకర్ శ్రీముఖి.. టైటిల్ విన్నర్ చాన్స్ ను మిస్ చేసుకుంది. ఆ తర్వాత సీజన్ 4 లో కూడా ఒక యాంకర్ ను తీసుకున్నారు. జోర్దార్ సుజాతను తీసుకున్నారు. కానీ.. జోర్దార్ సుజాత.. అంతగా హౌస్ లో ఆకట్టుకోలేకపోయింది.

అందుకే.. సీజన్ 5 లో మంచి ఫేమ్ ఉన్న లేడీ యాంకర్ ను తీసుకోవాలని బిగ్ బాస్ యాజమాన్యం యోచిస్తోందట. అందుకే.. జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీని బిగ్ బాస్ యాజమాన్యం సెలెక్ట్ చేసిందట. ఇప్పటికే తనను సంప్రదించడం కూడా పూర్తయిందట. కానీ.. తను ప్రస్తుతం మల్లెమాలతో వర్క్ చేస్తున్నందున.. తనను బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు.. మల్లెమాల యాజమాన్యం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. తనకు బిగ్ బాస్ లోకి వస్తే.. భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా బిగ్ బాస్ యాజమాన్యం వెనకాడటం లేదట. కానీ.. రష్మీకి మల్లెమాలతో అగ్రిమెంట్ ఉండటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదట. మరి.. మల్లెమాలతో బంధం తెంచుకొని.. బిగ్ బాస్ లోకి రష్మీ ఎంట్రీ ఇస్తుందా? లేక తనకు లైఫ్ ఇచ్చిన మల్లెమాల కోసం బిగ్ బాస్ ఆఫర్ నే వదిలేసుకుంటుందా? వేచి చూడాల్సిందే.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి