vivek : టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ 2019 లోక్ సభ ఎన్నికల్లో తనకు పెద్దపల్లి నియోజకవర్గ ఎంపీ టికెట్ ఇవ్వలేదనే కోపంతో బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గడ్డం వివేక్ vivek పరిస్థితి ఇప్పుడు అడ్డం తిరిగింది. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలతో సన్నిహితంగా మెలుగుతారు. పై స్థాయిలో మంచి సంబంధాలనే మెయింటెయిన్ చేస్తారు. కానీ క్షేత్ర స్థాయికి వచ్చేసరికి దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంటుంది. పొలిటికల్ పార్టీ అన్న తర్వాత నాయకులు ఎంత ముఖ్యమో కార్యకర్తలు కూడా అంతే ముఖ్యం. కానీ వివేక్ ఈ సంగతిని గమనించినట్లు లేడు. పునాదులు సరిగా లేకుండానే పెద్ద పెద్ద భవంతులు కట్టాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఫలితంగా ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. అందుకేనేమో బహుశా ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ కుదురుగా ఉండలేకపోతున్నారు.
వివేక్ vivek తో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా తనకంటూ ఒక స్పెషల్ గ్రూప్ క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. స్థానిక నేతలను కలుపుకుపోడు. దీంతో వాళ్లంతా ఏకమై ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తారు. గతంలో టీఆర్ఎస్ లో ఉన్నా, ప్రస్తుతం కమలం పార్టీలో ఉన్నా ఇదే పరిస్థితి. అందుకే వివేక్ కి పాలిటిక్స్ కలిసి రావట్లేదని అంటుంటారు. మనం పైనుంచి వచ్చినంత మాత్రాన గొప్ప కాదని, కింది స్థాయి కేడర్ ని కూడా పరిగణనలోకి తీసుకుపోవాలని హితవు పలుకుతున్నారు.
వివేక్ కాషాయం పార్టీలో చేరి పట్టుమని రెండేళ్లు కూడా అయిందో లేదో అప్పుడే ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వివేక్ వన్ మ్యాన్ ఆర్మీలా ఫీలవుతున్నాడని, ఒంటెత్తు పోకడలు పోతున్నాడని పెద్దపల్లి బీజేపీ లీడర్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులూ ఇదే మాట చెబుతున్నారు. ఈ మేరకు వాళ్లు రీసెంట్ గా మీటింగ్ పెట్టుకొని వివేక్ వ్యవహార శైలిపై చర్చించి హైకమాండ్ కి తెలియజేయాలని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గడ్డం వివేక్ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లోకి రెండు సార్ల చొప్పున వెళ్లొచ్చిన ఆయన ఇప్పుడు ఏ పార్టీలోకి పోతారో ఎవరికీ అర్థంకావట్లేదు. బాగుపడే జాతకం లేకపోతే ఇంతే. ఏ పార్టీలో చేరినా ఒరిగేది శూన్యం. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.