Anchor Sowmya | ఇంటర్వ్యూకి వెళ్తుండగా యాక్సిడెంట్.. ర‌క్తం కారుతున్నా వెళ్లి యాంక‌రింగ్ చేసిన సౌమ్య | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Sowmya | ఇంటర్వ్యూకి వెళ్తుండగా యాక్సిడెంట్.. ర‌క్తం కారుతున్నా వెళ్లి యాంక‌రింగ్ చేసిన సౌమ్య

 Authored By sandeep | The Telugu News | Updated on :17 August 2025,4:00 pm

Anchor Sowmya | పలు కన్నడ, తెలుగు సీరియల్స్‌తో పాటు జబర్దస్త్ వంటి షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సౌమ్య తన జీవితంలో ఎదురైన కష్టాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. యాంకరింగ్ కెరీర్‌ను కన్నడలో ప్రారంభించి, తరువాత తెలుగు టీవీ ఇండస్ట్రీకి వచ్చిన సౌమ్య…ఇప్పుడు పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్‌గా బిజీగా మారింది.

#image_title

ఎన్నో క‌ష్టాలు..

తాజాగా ఓ టెలివిజన్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుంది. కాలేజీ రోజుల‌లో పార్ట్ టైమ్‌గా యాంకరింగ్ చేస్తున్నాను. ఒకరోజు ఓ పెద్ద కన్నడ హీరో ఇంటర్వ్యూచేయాలి. ఆ ఇంటర్వ్యూకు వెళ్తుండగా రోడ్డుపై యాక్సిడెంట్ అయ్యింది. కార్ ఢీకొట్టి వెళ్ళిపోయింది. నన్ను చూసినవాళ్లు హాస్పిటల్‌కు వెళ్లమన్నారు. కానీ నా కాళ్లు నెత్తురోడుతున్నా, ఇంటర్వ్యూకు వెళ్లాల్సిందే అనిపించింది” అని చెప్పింది.

“ఎందుకంటే నేను వెళ్లకపోతే ఇంకొకరిని పంపించేస్తారు. నన్ను పిలిచిన ఆ ఛానల్ ఇక నన్ను నమ్మదు. అంతేకాదు, ఆ డబ్బులు కూడా పోతాయేమో అనిపించింది. అప్పుడు ఆ డబ్బులు నాకు ఎంతగానో అవసరం. అందుకే కాలికి కట్టుకేసుకొని ఇంటర్వ్యూకు వెళ్లాను” అంటూ సౌమ్య చెప్పిన ఈ సంఘటన నెటిజన్ల మనసులను కదిలిస్తోంది. అయితే ఆ స‌మ‌యంలో తన బాధను ఎవరూ చూడలేదని, తన భవిష్యత్తు కోసం ఎలాంటి త్యాగాలైనా చేయాల్సి వచ్చిందని తెలిపింది.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది