Big Breaking News : ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు…!!
Big Breaking News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 27వ తారీకు నుండి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం తో పాటు బీఎస్సీ సమావేశం జరగనుంది. ఆ తర్వాత రెండో రోజు సంతాప,వాయిదా తీర్మానాలు… ఉండగా తర్వాత సమావేశాలను వాయిదా వేయనున్నారు. మళ్లీ మార్చి 6వ తారీకు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
మొత్తం 13 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇదే చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అయితే మధ్యలో మార్చి 3, 4 తారీకులలో విశాఖలో గ్లోబల్ సమిట్ సమావేశాలు నేపథ్యంలో… అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడనున్నాయి. ఆ తర్వాత మార్చి 6వ తారీకు నుండి పున్న ప్రారంభం చేయనున్నారు.
ఈ క్రమంలో త్వరలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం. 13 రోజులపాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏపీకి సంబంధించి కీలక బిల్లులు వైసీపీ ప్రభుత్వం పాస్ చేయనున్నట్లు సమాచారం. మండలంలో పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఉన్న తరుణంలో…వైసీపీ చాలా పకడ్బందీగా ఈ సమావేశాలను నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.