Anu Emmanuel about Allu sirish On set
Anu Emmanuel : అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఎంత ఫన్నీగా ఉంటాడో అందరికీ తెలిసిందే. వెండితెరపై ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం అల్లు వారబ్బాయి పంచ్‌లు, కామెడీ టైమింగ్ మాత్రం హైలెట్ అవుతుంటాయి. ట్రోల్స్ జరిగినా కూడా, నెగెటివ్ కామెంట్స్ వచ్చినా కూడా ఎంతో కూల్‌గా రిప్లై ఇస్తుంటాడు. మరీ ముఖ్యంగా ఆడుకోవాలని చూసే నెటిజన్లను తనదైన స్టైల్లో కౌంటర్లతో నోర్మూయిస్తుంటాడు.
Anu Emmanuel about Allu sirish On set
అల్లు శిరీష్ టైమింగ్ గురించి చెప్పే పోస్ట్‌లు ఎన్నో ఉన్నాయి. ప్రతీ రోజూ అల్లు శిరీష్ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటాడు. అందులో ఎంతో సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. ఆ మధ్య లాక్డౌన్‌లో అల్లు శిరీష్ రకరకాల పోస్ట్‌లు చేశాడు. క్వారంటైన్‌లొ ఒంటరిగా ఉండటంపై తన బాధలు చెబుతూ ఫన్నీ వీడియోలు పోస్ట్ చేశాడు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ అకౌంట్ డీటైల్స్ అడిగిన నెటిజన్లకు అదిరిపోయేలా పంచ్‌లు ఇచ్చాడు.
అల్లు శిరీష్ తనతో పని చేసే హీరోయిన్లతోనూ ఎంతో చనువుగా ఉంటాడు. దాదాపు యంగ్ హీరోయిన్లందరూ కూడా అల్లు శిరీష్‌కు పరిచయమే. ఆ మధ్య రాశీ ఖన్నా ఓ రేంజ్‌లో ఏడిపించేశాడు. ఫన్నీ కామెంట్లు పెడుతూ ఆట పట్టిస్తుంటాడు. ఇప్పుడు అల్లు శిరీష్ అను ఇమాన్యుయేల్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సెట్‌లో అల్లు శిరీష్.. అను ఇమాన్యుయేల్‌ను ఆట పట్టిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడూ ఆమెను ఫోటో తీస్తూనే ఉంటున్నాడట.. ఇదే విషయాన్ని అను ఇమాన్యుయేల్ చెప్పుకొచ్చింది. అది ఆయన తప్పు కాదులేండి.. అంటూ తన అందం గురించి అను గొప్పగా చెప్పుకుందా? లేదా అల్లు శిరీష్ చేష్టలకు విసిగిపోయి అలా చెప్పిందా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Phone : జ్యోతిష్యాన్ని నమ్మేవారికి ఇది ఆసక్తికరంగా అనిపించవచ్చు కానీ తాజాగా వాట్సాప్ లో హల్చల్ చేస్తున్న ఓ సందేశం…
Turmeric Water In Copper Vessel : రాగి పాత్రలలో వండిన ఆహారం అయినా లేదా వాటిలో నిల్వ చేసిన…
Bitter Gourd Juice : భారతదేశంలో కరేలా అని కూడా పిలువబడే కాకరకాయ మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల్లో రాళ్లు…
Coconut Flower Benefits : కొబ్బరి చెట్టు ప్రపంచంలోని అత్యంత ప్రయోజనకరమైన చెట్లలో ఒకటి. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం…
Garlic : వెల్లుల్లి అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక సాధారణ వంట పదార్థం. కొలెస్ట్రాల్‌ను నిర్వహించడం,…
Constipation : మలబద్ధకం అనేది జీవితంలో ఏదో ఒక సమయంలో దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే ఒక సాధారణ…
Venus : జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. సంపదకు, శ్రేయస్సుకు, ఐశ్వర్యానికి, కీర్తికి ప్రతీక…
Wife : ఇప్పుడు ప్రభుత్వ స్కీంలు చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. పదవీ విరమణ కోసం స్మార్ట్ ఫండ్…
This website uses cookies.