YS Jagan : నేషనల్ మీడియాకి జగన్ ఇంటర్వ్యూ.. ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు !
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు నేషనల్ మీడియా అటెన్షన్ ను గ్రాబ్ చేస్తున్నారు. జాతీయ మీడియాలోనూ సీఎం జగన్ గురించే వార్తలు రాస్తున్నారు. ఏపీని ఆయన ఎలా అభివృద్ధి చేస్తున్నారు. ఎలాంటి పథకాలు ఏపీలో తీసుకొస్తున్నారు.. అనే వాటిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. స్విట్జర్లాండ్ ప్రెసిడెంటే సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు నేడు, మనబడి లాంటి కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను స్విస్ ప్రభుత్వం కొనియాడింది.
ఏ రాష్ట్రమైన అందరికీ ఒకే విద్యను అందించగలిగితే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే. దాన్ని సుసాధ్యం చేసిన సీఎం జగన్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోంది. ఈనేపథ్యంలో ఆయన నేషనల్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ తాము ఉచిత పథకాలు అమలు చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ.. మేము అమలు చేసేవి ఉచిత పథకాలు కాదు. ఇవన్నీ మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడి అని మేము అనుకుంటున్నాం. మేము దాన్ని మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిగానే చూస్తున్నాం. ప్రభుత్వం అలా ఆలోచించాలి. లేకపోతే ప్రగతి సాధించలేం. మా విద్యార్థులు సొంత కాళ్ల మీద నిలబడాలంటే..
YS Jagan : మేము అమలు చేస్తున్నవి ఉచిత పథకాలు కాదు
వాళ్లు ఉన్నత స్థానాలకు ఎదగాలంటే.. దానికోసం వాళ్లకు ఒక ప్లాట్ ఫామ్ ఇవ్వాల్సిందే. వాళ్లకు అవసరమైన వనరులను సమకూర్చాల్సిందే. దానికోసమే.. విద్య ప్రమాణాలను పెంచుతున్నాం. అభివృద్ధిలో వాళ్లనూ భాగస్వాములను చేస్తున్నాం అంటూ జగన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే.. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, భవిష్యత్తులో గ్రీన్, హైడ్రో ఎనర్జీలు కూడా వస్తాయని, ఏపీ పలు రకాల ఖనిజాలను స్థావరం అని.. ఏపీ పైపు ఇప్పుడు ప్రపంచం చూస్తోందని సీఎం జగన్ స్పష్టం చేశారు.