ap cm ys jagan very serious about exams
ys jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా ప్రజామోధకరమైన పరిపాలన కొనసాగిస్తున్నాడు. అన్ని కూడా ప్రజలు కోరుకుంటున్నట్లుగా జరుగుతున్నాయి. కాని ఒక్క విషయంలో మాత్రం వారి అభిప్రాయం పట్టించుకోకుండా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొండిగా ప్రవర్తిస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అవే 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు. కరోనా కరాళ నృతం చేస్తున్న ఈ సమయంలో ఏపీలో పరీక్షలు నిర్వహించాల్సిందే అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో ఉండటం విమర్శలకు తావిస్తుంది.
ఏపీలో ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుగు దేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ అన్నారు. కరోనా తో జనాలు చనిపోతూ ఉంటే పిల్లల ప్రాణాల పట్ల ఏమాత్రం బాధ్యత లేదా అంటూ జనాలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. అయినా కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం పట్టించుకోకుండా మొండిగా పరీక్షలు పెట్టేందుకు సిద్దం అయ్యాడు అంటూ ఆరోపించాడు. పరీక్షలు మొండిగా పెట్టేందుకు ప్రయత్నిస్తే ఆందోళనకు దిగుతాం అంటూ లోకేష్ హెచ్చరించాడు.
ap cm ys jagan very serious about exams
తెలంగాణతో పాటు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏపీలో మాత్రం పరీక్షలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. పరీక్షల తేదీలు ప్రకటించారు. ఆ తేదీల్లో ఖచ్చితంగా పరీక్షలు జరుగుతాయని అంటున్నారు. విద్యా సంస్థలు నడిచింది తక్కువ రోజులు అయినా కూడా పరీక్షలు పెడతాం అంటే ఎలా అంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరీక్షల రద్దును కోరుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ విషయమై విమర్శలు తప్పేలా లేవు.
తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందిన ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతో, హైట్…
CBI Court : హైదరాబాద్ సీబీఐ కోర్టు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో…
RTC Strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలు, రవాణా శాఖ మంత్రి…
KTR : తెలంగాణలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బిఆర్ఎస్ , కేసీఆర్ పై చేసిన…
Alcohol and Tobacco : పొగాకు, మద్యంను సమర్థవంతంగా నివారించడానికి, మీ ట్రిగ్గర్‌లను అర్థం చేసుకోవడం, సహాయక వ్యవస్థను సృష్టించడం,…
Kanuga Health Benefits : కానుగ అనేది మిల్లెటియా పిన్నాటా అనే వృక్షశాస్త్ర నామంతో పిలువబడుతుంది. ఇది బఠానీ కుటుంబంలోని…
Today Gold Price : ఈ మే 6వ తేదీ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల…
Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్రమే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…
This website uses cookies.