ఆ ఒక్క విషయంలో జగన్ పట్టుదల.. విమర్శలు తప్పవా?
ys jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా ప్రజామోధకరమైన పరిపాలన కొనసాగిస్తున్నాడు. అన్ని కూడా ప్రజలు కోరుకుంటున్నట్లుగా జరుగుతున్నాయి. కాని ఒక్క విషయంలో మాత్రం వారి అభిప్రాయం పట్టించుకోకుండా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొండిగా ప్రవర్తిస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అవే 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు. కరోనా కరాళ నృతం చేస్తున్న ఈ సమయంలో ఏపీలో పరీక్షలు నిర్వహించాల్సిందే అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో ఉండటం విమర్శలకు తావిస్తుంది.
ys jagan : లోకేష్ హెచ్చరిక..
ఏపీలో ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుగు దేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ అన్నారు. కరోనా తో జనాలు చనిపోతూ ఉంటే పిల్లల ప్రాణాల పట్ల ఏమాత్రం బాధ్యత లేదా అంటూ జనాలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. అయినా కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం పట్టించుకోకుండా మొండిగా పరీక్షలు పెట్టేందుకు సిద్దం అయ్యాడు అంటూ ఆరోపించాడు. పరీక్షలు మొండిగా పెట్టేందుకు ప్రయత్నిస్తే ఆందోళనకు దిగుతాం అంటూ లోకేష్ హెచ్చరించాడు.
ys jagan : పక్క రాష్ట్రాల్లో పరీక్షల రద్దు..
తెలంగాణతో పాటు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏపీలో మాత్రం పరీక్షలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. పరీక్షల తేదీలు ప్రకటించారు. ఆ తేదీల్లో ఖచ్చితంగా పరీక్షలు జరుగుతాయని అంటున్నారు. విద్యా సంస్థలు నడిచింది తక్కువ రోజులు అయినా కూడా పరీక్షలు పెడతాం అంటే ఎలా అంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరీక్షల రద్దును కోరుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ విషయమై విమర్శలు తప్పేలా లేవు.