Ys Jagan : ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో గతంలో నందమూరి తారక రామారావు మరియు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహంకు గురి అయిన వారే. కేవలం ఏపీలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం వల్ల గద్దె దిగిన ముఖ్యమంత్రులు ఉన్నారు. అందుకే అన్ని ప్రభుత్వాలు కూడా వారిని మచ్చిక చేసుకుని వారితో సానుకూలంగా ఉంటూ పనులు చేయించుకుంటూ ఉంటారు. వారు కోరినంత కాకున్నా వారికి సంతోషం కలిగించేంత జీతాలు పెంచుతూ పీఆర్‌సీ ని అమలు చేస్తూ ఉద్యోగుల విషయంలో సానుకూలంగా ఉంటూ ఉంటారు. ఈ సమయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గత అనుభవాలు దృష్టి లో పెట్టుకుని కూడా జగన్ ఉద్యోగులతో వివాదం పెట్టుకుంటున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా కూడా ఉద్యోగుల విషయాల్లో ఎలాంటి మెరుగు లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచడం అనేది ప్రభుత్వ బాధ్యత అంటూ ఉద్యోగస్తులు పీఆర్‌సీ కి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జీతాల పెంపు విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపు విషయం లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకున్నా సరిపోయేది.. ఇప్పుడు పెంపు నిర్ణయం తీసుకుని ఉద్యోగస్తుల ఆగ్రహం కు గురి అవ్వాల్సి వస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండటం వల్ల ఆయనకు వ్యతిరేంగా పని చేశారు అనేది టాక్.. ఇప్పుడు జగన్ కు అదే తప్పదేమో.
జగన్ ప్రభుత్వం నుండి ఉద్యోగులు ఆశించిన పెంపులో కనీసం 25 శాతం కూడా దక్కలేదు అనేది రాజకీయ మరియు ఉద్యోగ వర్గాల వారి టాక్. అస్సలు ఉద్యోగస్తులు మరియు పెన్షనర్స్ అంటే ప్రభుత్వంకు ఎందుకు కోపం అన్నట్లుగా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్క ఉద్యోగి మనోభావాలు దెబ్బ తినే విధంగా జగన్ ప్రభుత్వం పనులు చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తిపున్యానికి పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అంటూ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కొందరు చేసిన వ్యాఖ్యలు వారికి కోపం తెప్పించాయి. ఈ కోపం వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే కచ్చితంగా జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కష్టం అవుతుంది. ఎన్నికలకు ఎలాగూ సమయం ఉంది కనుక ఖచ్చితంగా మార్పు వస్తుందని వైకాపా నాయకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో అనేది చూడాలి.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.