AP Governor : జగన్ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ గవర్నర్ !
AP Governor : పదోన్నతులపై తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పదోన్నతులపై కొత్త విధానాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ రాజ్ భవన్ కూడా స్పందించింది. పదోన్నతులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో రాజ్ భవన్ స్పందించి.. ప్రభుత్వం పదోన్నతులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇనిషియల్ క్యాడర్ విధానంలో సీనియారిటీని అమలు చేయాలని ఉద్యోగుల పదోన్నతులపై గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అసంతృప్తిని మిగిల్చింది.
ఎందుకు గత కొన్నేళ్లుగా అమలు అవుతున్న నిబంధనలను పక్కన పెట్టి ఉన్నపళంగా ఇనిషియల్ క్యాడర్ విధానాన్ని తీసుకొచ్చారని ఉద్యోగులు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉన్న కేటగిరీలనే పరిగణనలోకి తీసుకోవాలని.. కొత్త విధానాన్ని ఆపేయాలని.. దీనిపై గవర్నర్ ఆదేశాలు జారీ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. సాధారణంగా ఎక్కడైనా పదోన్నతుల విషయంలో పనిచేసే పొజిషన్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ.. ఉద్యోగి నియామక తేదీ నుంచి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలనే నిర్ణయం అనేదే ప్రస్తుతం వివాదాస్పదం అయింది.
AP Governor : ఉద్యోగ నియామక తేదీ నుంచి సీనియారిటీలని ఎలా పరిగణనలోకి తీసుకుంటారు?
దీనిని కొందరు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కావాలని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కులను హరించేలా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో పదోన్నతుల వ్యవహారంపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గవర్నర్ కోరారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సమయంలో ఒక విధంగా మాట్లాడి.. ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎందుకు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం దేనికి సంకేతం అంటూ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.