kathi mahesh సినీ విమర్శకుడు కత్తి మహేశ్ kathi mahesh మరణం పలు అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో న్యాయ విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ చేసిన డిమాండ్‌కు ఏపీ ప్రభుత్వం స్పందించింది. చిత్తూరు జిల్లాలోని కత్తి మహేశ్ స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. కత్తి మహేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ, సీఎం జగన్ కోసం ప్రచారం చేశారని, అలాంటి వ్యక్తి చనిపోతే సీఎం జగన్ కనీసం సంతాప ప్రకటన కూడా చేయలేదని మందకృష్ణ మాదిగ విమర్శించారు.
కత్తి మహేశ్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కత్తి మహేశ్ ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవర్ సురేశ్ స్వల్పగాయాలతో బయటపడటం, ఎడమ వైపు కూర్చున్న మహేశ్ kathi mahesh కు తీవ్రంగా గాయపడటం అనుమానాలకు తావిస్తోందని మంద కృష్ణ మాదిగ అన్నారు. కత్తి మహేశ్ kathi mahesh కు చాలామంది శత్రువులున్నారని.. గతంలోనూ కత్తి మహేశ్ పై అనేక దాడులు జరిగాయని మంద కృష్ణ మాదిగ గుర్తుచేశారు. ఈ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. మందకృష్ణ మాదిగ డిమాండ్‌పై స్పందించిన వైఎస్ జగన్ సర్కార్… కత్తి మహేశ్ మరణంపై విచారణకు ఆదేశించింది.
దీంతో కత్తి మహేష్ కారు ప్రమాదంపై నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం రోజున కారు నడిపిన సురేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు. కత్తి మహేశ్ కారు డ్రైవర్ సురేష్‌ను విచారణకు పిలిచారు. ప్రమాదం జరిగిన తీరు, కత్తి మహేష్ తీవ్రంగా గాయపడితే డ్రైవర్ సురేష్‌కు ఎందుకు చిన్నగాయం కూడా కాలేదన్నది అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం తర్వాత ఏం జరిగిందన్న దానిపైనా పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కత్తి మహేష్ మృతిపై తమకూ అనుమానాలున్నాయని కత్తి మహేష్ తండ్రి ఓబులేసు పేర్కొన్నారు.
మహేష్ చనిపోయిన విషయాన్ని తమకంటే ముందే బయటకు చెప్పారని తెలిపారు. కత్తి మహేశ్ మృతిపై న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని ఓబులేసు కోరారు. అయితే సోషల్ మీడియాలో కూడా కత్తి మహేశ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి వరకు బాగున్న మనిషి ఉన్నట్టుండి ఎలా చనిపోయారని, దీనిపై వైద్యులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కత్తి మహేష్ మరణంపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ డిమాండ్ చేస్తున్నారు.
చనిపోవడానికి ముందు రోజు ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కత్తి మహేష్ మేనమామ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మేనల్లుడు బాగున్నాడని.. వైద్యానికి స్పందిస్తున్నాడని.. మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తానని వైద్యులు చెప్పారని తెలిపారు. కానీ అంతలోనే చనిపోయారని చెప్పారంటూ.. అసలు ఆక్సిజన్ తొలగించిన తర్వాత ఏమైందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత కత్తి మహేశ్ కు చేసిన సర్జరీలు అన్నీ సక్సెస్ అయ్యాయి.
కానీ ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల కత్తి మహేష్ మరణించారని వైద్యులు తెలిపారు. అయితే ఆయన సన్నిహితులతో పాటు కొందరు బంధువులు కూడా కత్తి మహేష్ మృతి వెనుక ఏదో మిస్టరీ ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. కత్తి మహేష్ మృతిపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసుల విచారణలో గానీ, వైద్యుల హెల్త్ బులెటిన్ లో గానీ ఏం జరిగిందన్న విషయం బయటపడుతుందని కత్తి మహేష్ అభిమానులు భావిస్తున్నారు.
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
This website uses cookies.