AP Volunteers : వాలంటీర్లపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..?
AP Volunteers : దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను ఏపీ వ్యాప్తంగా తీసుకొచ్చారు సీఎం జగన్. నిజంగా ఇదొక గొప్ప పరిణామం. దేశంలో ఇప్పటి వరకు ఇటువంటి వ్యవస్థే లేదు. కానీ తొలిసారి సీఎం జగన్ తీసుకొచ్చిన అద్భుతమైన వ్యవస్థ ఇది. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రారంభించినా… పేదల కోసం ఎన్ని మంచి సంక్షేమ పథకాలు తెచ్చినా… అవి అందరు ప్రజల వరకు వెళ్తాయన్న నమ్మకం లేదు. అసలైన లబ్ధిదారులకు ఆయా పథకాల ఫలాలు అందుతాయా? అనేదానికి నూటికి నూరు శాతం అందుతాయి అని చెప్పలేం. అందుకే.. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందాలంటే వాళ్లకు సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించాలంటే… అసలైన లబ్ధిదారులను గుర్తించాలంటే క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉండాలని ఆలోచించి… సీఎం జగన్ ప్రవేశపెట్టిన గొప్ప వ్యవస్థ ఇది.
అయితే… వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, ఎన్నో ఆందోళనలు వస్తున్న విషయమూ తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలైతే వాలంటీర్ల వ్యవస్థ కేవలం వైసీపీ పార్టీ కోసం పనిచేస్తోందని… ప్రభుత్వం కోసం కాదు… ప్రజల కోసం కాదని ఆరోపణలు చేస్తున్నా… వాలంటీర్ల వ్యవస్థ వల్ల క్షేత్రస్థాయిలో అసలైన లబ్ధిదారులకు ఫలాలు అందుతున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే… అధికార పార్టీ తమ సొంత పనుల కోసం వాలంటీర్లను వాడుకుంటోందని ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఆ వ్యవస్థను మాత్రం తప్పు పట్టలేం. కానీ… అసలు.. ఈ వాలంటీర్ల వ్యవస్థపైనే కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఏపీ మంత్రి వాలంటీర్ల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP Volunteers : ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులుగా మారిన వాలంటీర్లు
కొందరు వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇప్పటి వరకు వాలంటీర్ల వ్యవస్థ గురించి కానీ.. వాలంటీర్ల గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి లేరు… మాట్లాడిన వైసీపీ నేత లేరు. వాళ్లతో చిన్న చిన్న సమస్యలు ఉంటే… అక్కడికక్కడే పరిష్కరించుకునే వాళ్లు కానీ… ఇలా మీడియా ముందు వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడటం మాత్రం ఇదే మొదటిసారి. విజయనగరం జిల్లాలో కొందరు వాలంటీర్లు ప్రభుత్వానికి, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. కురుపాం నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వాలంటీర్లు సీఎం జగన్ కు, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.
అలాగే… అదే జిల్లాలోని గరుగుబిల్లి మండలంలో ఒక వాలంటీర్ భర్త ఏకంగా ప్రభుత్వానికే వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారని… మొత్తం వాలంటీర్ల వ్యవస్థలోనే 90 శాతం వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే… 10 శాతం వాలంటీర్లు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులుగా పనిచేస్తున్నారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చిందన్నా…. అందరూ మెచ్చుకుంటున్నారన్నా దానికి కారణం సీఎం జగన్ అనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని మంత్రి సూచించారు.