Botsa Satyanarayana : రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు రాజధానులు తెచ్చి తీరుతాం
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి వికేంద్రీకరణ ఫలితాలను ఫలాలను అందించేందుకు గాను వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంకణ బద్దమై ఉంది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించాడు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాల్సిందే అని తమ ప్రభుత్వం యొక్క అభిప్రాయమంటూ మంత్రి బొత్స పేర్కొన్నారు. ఒక ప్రాంతానికి.. ఒక వర్గానికి లాభం చేకూరే విధంగా రాజధాని ఉండడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని తాము భావిస్తున్నామని, అందుకే 3 రాజధానుల ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బొత్స సత్యనారాయణ పేర్కొన్నాడు.
కోర్టు తీర్పు గౌరవిస్తూనే కచ్చితంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష కూడా తెలుసుకుని వారి యొక్క మూడు రాజధానులు అవసరం ను తీర్చుతాం అంటూ బొత్స వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే అసెంబ్లీలో మూడు రాజధానుల యొక్క బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో కాస్త ఆలస్యంగా మూడు రాజధానుల బిల్లును తీసుకు వస్తాం అంటూ ప్రకటించాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కచ్చితంగా జగన్ ప్రభుత్వం అధికారికంగా మూడు రాజధానులు బిల్లుని అసెంబ్లీ ముందుకు తీసుకు వచ్చి పాస్ చేస్తుందని బొత్స అన్నాడు.
ఆ తర్వాత మూడు రాజధానులు ఏర్పాటు చేయడం జరుగుతుందని.. కచ్చితంగా రెండేళ్లు లేదా మూడేళ్ల తర్వాత ఏపీ సీఎం అధికారి కార్యాలయం వైజాగ్ లో ఉంటుంది అని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఇంకా 3 రాజధానులు విషయం సజీవంగానే ఉందని రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక అమరావతి ప్రజలు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే అంటూ వైకాపా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అభివృద్ది వికేంద్రీకరణ పై చాలా పట్టుదలతో ఉన్నారు.