Botsa Satyanarayana : అమరావతి రాజధానిపై మంత్రి బొత్స వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్
Botsa Satyanarayana : ప్రస్తుతం ఏపీలో రాజధాని అంశం అగ్గి రాజేసింది. ఏపీలో ఎక్కడ చూసినా రాజధాని గురించే చర్చ. తాజాగా అమరావతి క్యాపిటల్ ఇష్యూపై మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాస్పదంగా మారాయి. అవి అగ్గికి మరింత ఆజ్యం పోశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. ఏపీలో చర్చనీయాంశం అయ్యాయి. అధికార పార్టీకి చెందిన నేత, మంత్రి అయి ఉండి.. బొత్స ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ప్రజలు మండిపడుతున్నారు.
అమరావతి క్యాపిటల్ పేరుతో రైతులు చేస్తున్న యాత్రను అడ్డుకోవడం ప్రభుత్వానికి పెద్ద పని కాదు. వాళ్లను అడ్డుకోవడం ఐదు నిమిషాల పని.. అంటూ మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్ చేశారు. అమరావతి సమీపంలో ఉన్న దాదాపు 29 గ్రామాల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకత లేదు. గత ప్రభుత్వం వాళ్లతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది. దాన్ని మా ప్రభుత్వం గౌరవిస్తోంది.. అని బొత్స తెలిపారు.
Botsa Satyanarayana : ఉత్తరాంధ్ర ప్రజలు చేతగానివారు కాదు
ఉత్తరాంధ్ర ప్రజలు చేతగానివారు కాదు. వాళ్లు చేతగానివారు అని అనుకుంటే అది పొరపాటే అని మంత్రి బొత్స హెచ్చరించారు. రైతుల యాత్రను అడ్డుకోవడానికి కేవలం ఐదు నిమిషాలు చాలు అంటూ బొత్స హెచ్చరించారు. అటు కాకినాడ నుంచి ఇటు ఇచ్చాపురం వరకు అందరూ కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది. భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను నిర్వహిస్తామని.. ఎప్పటికప్పుడు ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని బొత్స ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అయితే.. బొత్స వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇష్యూను మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము వైసీపీకి ఉందా అని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు.