Home » Andhra Pradesh » Ap Minister Kodali Nani Fires On Chandra Babu Naidu
andhra pradesh

Kodali Nani : చంద్రబాబు జన్మలో ఇక సీఎం కాలేడు : మంత్రి కొడాలి నాని

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: February 25, 2022, 7:00 am
Advertisement

Kodali Nani : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేడని రాష్ట్ర మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ పై కావాలని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. ఎల్లో మీడియా ప్రతి రోజూ ఏదో ఒక తప్పుడు కథనాన్ని రాయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. సీఎం జగన్ పై కావాలని బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

వెంటనే చంద్రబాబు సీఎం కావాలనేదే ఎల్లో మీడియా తాపత్రయం. ఆయనను ముఖ్యమంత్రిని చేసేదాకా వాళ్లను నిద్రపట్టేలా లేదు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం వాళ్ల వల్ల కాదు. జన్మలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. ఇక అది జరగని పని.. అని కొడాలి నాని స్పష్టం చేశారు.కాకినాడ పోర్టు నుంచి చాలా ధాన్యం ఎగుమతి అవుతోంది. అందుకే.. ఏపీలో కాకినాడ పోర్టు.. ధాన్యం ఎగుమతిలో మొదటి స్థానంలో ఉంది. రైతుల పంటకు సంబంధించిన అన్ని వివరాలు క్రాప్ యాప్ లో ఉంటాయి.

ap minister kodali nani fires on chandra babu naidu

Advertisement

Kodali Nani : సన్నబియ్యం ఎగుమతిలో ఎటువంటి అవినీతి జరగలేదు

అంతా అన్ లైన్ అయింది. ఎటువంటి అవినీతి లేదు. మరి.. ఎల్లో మీడియా ఇలాంటి తప్పుడు కథనాలను ఎందుకు రాస్తున్నట్టు. కావాలని సీఎం జగన్ పై దుష్ప్రచారం చేయడం కోసమా? పేదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్ పై ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారా? జగన్ ను బ్యాడ్ చేయాలనుకుంటే.. మిమ్మల్ని ఏపీ ప్రజలు బుద్ధి చెబుతారు. 2024లో మరోసారి ఓటుతో మీకు బుద్ధి చెప్తారు.. అంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి