Special Category Status : ఈ విషయంలో ఏపీలోని అన్ని పార్టీలు యూటర్న్..?
Special Category Status : ఏపీ పాలిటిక్స్ రోజురోజుకూ బాగా హీటెక్కుతున్నాయి. ఎలక్షన్స్ ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలన్ని కూడా అప్పుడే ఎన్నికలకు సమాయత్తమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కాగా, ఒక విషయంలో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ యూటర్న్ తీసుకున్నాయని ప్రజలు అంటున్నారు.ప్రత్యేక తరగతి హోదా విషయంలో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మాట్లాడాయి. కానీ, ఈ విషయమై ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని జనం అనుకుంటున్నాయి. ప్రజాక్షేత్రంలో ఈ విషయమై మాట్లాడి పోరు జరిపిన పరిస్థితి లేదు. కాగా, వచ్చే ఎన్నికల సందర్భంగా మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించే హక్కు పార్టీలకుందా అని పలువురు అడుగుతున్నారు.
ప్రత్యేక తరగతి హోదా విషయంలో ప్రధాన శత్రువు బీజేపీ. కాగా, వైసీపీ, టీడీపీ, జనసేన కూడా బీజేపీ చెప్పినట్లే నడుచుకుంటున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ప్రత్యేక తరగతి హోదాను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు కూడా. అధిక మెజారిటీతో గెలిచిన వైసీపీ.. తమకు 22 మంది ఎంపీలున్నప్పటికీ బీజేపీ సొంతంగానే బలంగా ఉండటం వల్ల తామేమీ చేయలేమని చేతులెత్తేశారు జగన్. ఇక ప్రత్యేక తరగతి హోదా సంగతి సైడ్ ట్రాక్ అవడానికి ప్రధాన కారణం చంద్రబాబు అని కొందరు విమర్శిస్తున్నారు. నాడు ప్రత్యేక ప్యాకేజీ వద్దని ప్రత్యేక తరగతి హోదా కావాలని పట్టుబట్టి ఉండే ఇటువంటి పరిస్థితులు నెలకొనేవి కావని అంటున్నారు. ఇక ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డుగా అభివర్ణించిన జనసేనాని పవన్ కల్యాణ్ మళ్లీ వెళ్లి ఆ బీజేపీతోనే పొత్తు పెట్టుకుని ఆ అంశం మరిచపోయారని అంటున్నారు.
Special Category Status : ఆ విషయమై మాట్లాడే హక్కు పార్టీలకుందా?
ఇక కాంగ్రెస్ పార్టీని కాని, వామపక్ష పార్టీలను కాని జనం నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్తున్నారు. మొత్తంగా ప్రత్యేక తరగతి హోదా విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలన్ని కూడా ఏపీలో ఫెయిల్ అయ్యాయని పలువురు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ అంశం మళ్లీ తెర మీదకు వస్తుందో లేదో చూడాలి మరి..