Home » News » Apple Event Date Time Where To Watch
News

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Authored By
Sam C
The Telugu News | Published on: September 9, 2025, 4:00 pm
Advertisement

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన వార్షిక ఈవెంట్‌ను ఈరోజు (సెప్టెంబర్ 10, 2025) కాలిఫోర్నియాలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్‌కు “ఆవ్‌ డ్రాపింగ్‌” అనే పేరును ఇచ్చారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈవెంట్‌ ప్రారంభం కానుంది.

Advertisement

#image_title

ఈవెంట్‌లో అత్యంత ఆసక్తికర అంశం ఐఫోన్‌ 17 సిరీస్. ఈ సిరీస్‌లో నాలుగు కొత్త మోడల్స్‌ విడుదల చేయనున్నారు:

Advertisement

ఐఫోన్‌ 17

ఐఫోన్‌ 17 ఎయిర్

Advertisement

ఐఫోన్‌ 17 ప్రో

ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్

ఇందులో “ఐఫోన్‌ 17 ఎయిర్” ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కేవలం 5.5 మిల్లీమీటర్ల మందంతో ఇప్పటివరకు లాంచ్‌ చేసిన ఐఫోన్లలో అత్యంత సన్నని ఫోన్ గా గుర్తింపు పొందనుంది. ఇందులో 6.6 అంగుళాల ప్రో మోషన్ డిస్‌ప్లే, ఏ19 ప్రాసెసర్, ఆపిల్‌ డెవలప్ చేసిన వై-ఫై చిప్ వంటివి ప్రత్యేకతలుగా ఉంటాయి. ఫిజికల్ సిమ్ స్లాట్‌ లేకుండా కేవలం ఈ-సిమ్‌ ఆధారంగా పని చేయనుంది.

ధరల పరంగా ఎలా ఉండబోతోంది?

Advertisement

ఐఫోన్‌ 17 ఎయిర్: సుమారు 900 డాలర్లు (రూ. 75,000 – 80,000)

ఐఫోన్‌ 17 బేస్ మోడల్: సుమారు 800 డాలర్లు (రూ. 70,000కుపైగా)

ప్రో & ప్రో మ్యాక్స్ మోడల్స్: $1000+ (రూ. 85,000 పైగా)

ఫీచర్లు & టెక్నాలజీ

Advertisement

ఐఫోన్ 17 బేస్ మోడల్:

120Hz ప్రో మోషన్ టెక్నాలజీ

ఏ19 ప్రాసెసర్

48MP మెయిన్ కెమెరా

ప్రో/ప్రో మ్యాక్స్ మోడల్స్:

6.3 అంగుళాల & 6.9 అంగుళాల డిస్‌ప్లేలు

48MP టెలిఫొటో లెన్స్

ఫ్రంట్ & రియర్ డ్యూయల్ వీడియో రికార్డింగ్

అల్యూమినియం బాడీ (టైటానియం స్థానంలో)

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి