Good News : కొత్తగా కారు కొనాలని చూస్తున్నారా..? అయితే మీకు కేంద్రం గుడ్ న్యూస్ అందించబోతుంది !!

Good News : కొత్తగా కారు కొనాలని చూస్తున్నారా..? అయితే మీకు కేంద్రం గుడ్ న్యూస్ అందించబోతుంది !!

 Authored By sudheer | The Telugu News | Updated on :26 January 2026,11:00 am

Good News : భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనివల్ల విదేశీ లగ్జరీ కార్ల ప్రియులకు భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం మన దేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై ప్రపంచంలోనే అత్యధికంగా 110 శాతం వరకు సుంకం (టారిఫ్) వసూలు చేస్తోంది. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం, సుమారు రూ. 16.3 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన యూరోపియన్ కార్లపై ఈ సుంకాన్ని ఏకంగా 40 శాతానికి తగ్గించే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. భవిష్యత్తులో ఈ కోతలు క్రమంగా 10 శాతానికి కూడా చేరుకోవచ్చని అంచనా.

Good News కొత్తగా కారు కొనాలని చూస్తున్నారా అయితే మీకు కేంద్రం గుడ్ న్యూస్ అందించబోతుంది

Good News : కొత్తగా కారు కొనాలని చూస్తున్నారా..? అయితే మీకు కేంద్రం గుడ్ న్యూస్ అందించబోతుంది !!

ఈ నిర్ణయం వెనుక బలమైన ఆర్థిక మరియు రాజకీయ కారణాలు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, మరియు వోక్స్‌వ్యాగన్ వంటి ఐరోపా ఆటోమొబైల్ దిగ్గజాలు భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తరించుకోవడానికి చాలా కాలంగా ఈ పన్ను తగ్గింపును కోరుతున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన వాణిజ్య విధానాలు, అదనపు టారిఫ్ వడ్డింపుల నేపథ్యంలో.. భారత్ తన వ్యాపార సంబంధాలను యూరోపియన్ దేశాలతో మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. తద్వారా అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితిని ఎదుర్కోవడానికి భారత్ ఒక వ్యూహాత్మక మార్గాన్ని ఎంచుకుంది.

ప్రస్తుతం యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ భారత్ పర్యటనలో ఉండటంతో ఈ ఒప్పందం మంగళవారం నాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇంతకాలం ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా స్వదేశీ కంపెనీలను రక్షించడానికి విదేశీ కార్లపై భారీ సుంకాలు విధించిన ప్రభుత్వం, ఇప్పుడు పోటీని పెంచడం ద్వారా ధరలను తగ్గించాలని చూస్తోంది. ఈ టారిఫ్ కోతల వల్ల భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త పోటీ నెలకొంటుందని, తద్వారా వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికత కలిగిన లగ్జరీ కార్లు తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

    sudheer

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది