
Loan : ఎలాంటి హామీ లేకుండా మీకు రూ. 20 లక్షల లోన్.. ఎలా అంటే
Loan : ఈ రోజుల్లో వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు డబ్బు అనేది పెద్ద సమస్య గా మారింది. చాలామంది బ్యాంకుల వద్ద రుణం కోసం ప్రయత్నించినా, అధిక డాక్యుమెంట్లు, గ్యారంటీలు, తాకట్టు వంటి కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరించబడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) ఎంతో మందికి ఆశాజ్యోతి చూపిస్తోంది. ఈ పథకం ద్వారా ఎలాంటి తాకట్టు అవసరం లేకుండా చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌ల కోసం రుణాలను పొందవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు.
ఇటీవల ప్రభుత్వం ఈ ముద్రా రుణాల పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పెంచింది. ఇది యువ వ్యాపారవేత్తలకు మరింత మేలు చేస్తుంది. ముద్రా రుణాలు నాలుగు వర్గాలుగా ఉంటాయి . శిశు (రూ. 50,000 వరకు), కిశోర్ (రూ. 50,000 – రూ. 5 లక్షలు), తరుణ్ (రూ. 5 – రూ. 10 లక్షలు), మరియు తాజాగా ప్రారంభమైన తరుణ్ ప్లస్ (రూ. 10 – రూ. 20 లక్షలు). ఇవి అభివృద్ధి దశలో ఉన్న వ్యాపారాలకు లేదా మరింత వ్యాప్తి చెందాలనుకునే వ్యాపారాలకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ రుణాలు తక్కువ వడ్డీ రేటుతో లభించడం, తాకట్టు లేకపోవడం ఈ పథకానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Loan : ఎలాంటి హామీ లేకుండా మీకు రూ. 20 లక్షల లోన్.. ఎలా అంటే
ఈ రుణాన్ని పొందాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, వ్యాపార ప్రణాళిక వంటి పత్రాలు సిద్ధంగా ఉంచాలి. దరఖాస్తు చేయాలంటే మీ సమీప బ్యాంకుకు వెళ్లి లేదా ఉద్యమ మిత్ర (www.udyamimitra.in) వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో కూడా అప్లై చేయవచ్చు. అన్ని వివరాలు సమర్పించిన తర్వాత బ్యాంకు మీ అప్లికేషన్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ముద్రా రుణం ద్వారా తన స్వయం ఉపాధికి నాంది పలకాలనుకునే ప్రతీ యువతీ యువకుడు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
This website uses cookies.