Loan : ఎలాంటి హామీ లేకుండా మీకు రూ. 20 లక్షల లోన్.. ఎలా అంటే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Loan : ఎలాంటి హామీ లేకుండా మీకు రూ. 20 లక్షల లోన్.. ఎలా అంటే

 Authored By ramu | The Telugu News | Updated on :22 May 2025,8:00 pm

Loan : ఈ రోజుల్లో వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు డబ్బు అనేది పెద్ద సమస్య గా మారింది. చాలామంది బ్యాంకుల వద్ద రుణం కోసం ప్రయత్నించినా, అధిక డాక్యుమెంట్లు, గ్యారంటీలు, తాకట్టు వంటి కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరించబడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) ఎంతో మందికి ఆశాజ్యోతి చూపిస్తోంది. ఈ పథకం ద్వారా ఎలాంటి తాకట్టు అవసరం లేకుండా చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌ల కోసం రుణాలను పొందవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు.

ఇటీవల ప్రభుత్వం ఈ ముద్రా రుణాల పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పెంచింది. ఇది యువ వ్యాపారవేత్తలకు మరింత మేలు చేస్తుంది. ముద్రా రుణాలు నాలుగు వర్గాలుగా ఉంటాయి . శిశు (రూ. 50,000 వరకు), కిశోర్ (రూ. 50,000 – రూ. 5 లక్షలు), తరుణ్ (రూ. 5 – రూ. 10 లక్షలు), మరియు తాజాగా ప్రారంభమైన తరుణ్ ప్లస్ (రూ. 10 – రూ. 20 లక్షలు). ఇవి అభివృద్ధి దశలో ఉన్న వ్యాపారాలకు లేదా మరింత వ్యాప్తి చెందాలనుకునే వ్యాపారాలకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ రుణాలు తక్కువ వడ్డీ రేటుతో లభించడం, తాకట్టు లేకపోవడం ఈ పథకానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Loan ఎలాంటి హామీ లేకుండా మీకు రూ 20 లక్షల లోన్ ఎలా అంటే

Loan : ఎలాంటి హామీ లేకుండా మీకు రూ. 20 లక్షల లోన్.. ఎలా అంటే

ఈ రుణాన్ని పొందాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, వ్యాపార ప్రణాళిక వంటి పత్రాలు సిద్ధంగా ఉంచాలి. దరఖాస్తు చేయాలంటే మీ సమీప బ్యాంకుకు వెళ్లి లేదా ఉద్యమ మిత్ర (www.udyamimitra.in) వెబ్‌సైట్‌ ద్వారా ఆన్లైన్‌లో కూడా అప్లై చేయవచ్చు. అన్ని వివరాలు సమర్పించిన తర్వాత బ్యాంకు మీ అప్లికేషన్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ముద్రా రుణం ద్వారా తన స్వయం ఉపాధికి నాంది పలకాలనుకునే ప్రతీ యువతీ యువకుడు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది