Chiranjeevi : మళ్లీ రాజకీయాల్లోకి వెళితే ఉన్న గౌరవం కూడా పోయి.. అన్నీ కోల్పోతావు.. చిరంజీవిని హెచ్చరించిన ఆ జ్యోతిష్యుడు?
Chiranjeevi : త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారు. అంటే ఆయన పార్టీ పెట్టడం లేదు. కానీ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు మద్దతు ఇవ్వనున్నారు.. అనేది ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంలో ఉన్న విషయం. జనసేన పార్టీ ముఖ్యనేత నాదేండ్ల మనోహర్ మీడియా ముందే చిరంజీవి.. జనసేన పార్టీకి మద్దతు ఇస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి పరోక్షంగా పార్టీకి మద్దతు ఇస్తారా? లేక జనసేనలో చేరుతారా? అసలు.. చిరంజీవి ఎలా ప్లాన్ చేసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? లాంటి అనేక ప్రశ్నలు ఏపీ ప్రజల్లో మెదులుతున్నాయి.

astrologer Achyutha Sastry from vizag warns chiranjeevi to keep away from politics
ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు.. జనసేనలో చేరారు. మెగా ఫ్యామిలీ మొత్తం.. జనసేన పార్టీనే అనుకోండి కానీ.. మద్దతు ఇస్తున్నామంటూ ఎవ్వరూ ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ.. చిరంజీవి జనసేనకు మద్దతు ఇస్తారని నాదెండ్ల చెప్పడంతో ఏపీ రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా మారిపోయాయి.
చిరంజీవికి రాజకీయాలు అస్సలు కలిసిరావు.. అవే శాపంగా మారుతాయి : Chiranjeevi
అయితే.. చిరంజీవి రాజకీయాల్లోకి మళ్లీ వస్తారు అనే వార్తలు ప్రచారంలో ఉండగా.. వైజాగ్ కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు అచ్యుత శాస్త్రి ఏమంటున్నారంటే… చిరంజీవి రాజకీయాలకు పనికిరారు. ఆయనకు రాజకీయాలు అస్సలు సూట్ అవ్వవు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే… ఆయన గ్రహ స్థితులే ఆయనకు శాపంగా మారుతాయి. ఆయనకు శుక్రుడు బలంగా ఉండటం వల్ల.. కేవలం సినిమాల వల్ల మాత్రమే ఆయనకు ఎంతో సక్సెస్, పేరు ప్రఖ్యాతలు వస్తాయి.
2007 లో కూడా చిరంజీవిని ఇదే చెప్పాను కానీ.. అప్పుడు నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. మళ్లీ ఆయన రాజకీయాలవైపు అడుగేస్తే.. ఆయనకు ప్రస్తుతం ఉన్న మర్యాద, గౌరవం అన్నీ పోతాయి. ఒకవేళ ఆయన జనసేన పార్టీలో చేరితే.. భవిష్యత్తులో పార్టీ మనుగడలోనే లేకుండా పోయే ప్రమాదం ఉంది. చిరంజీవికి తన జీవిత గమ్యం ఏంటో తెలుసుకొని అదే దారిలో వెళ్తే మంచిది. అప్పుడే ఆయనకు ప్రశాంతత, విజయం లభిస్తాయి. ఒకవేళ ఆయన దారి మళ్లితే మాత్రం ఆయనకు మిగిలేది ఓటములు, డిప్రెషన్.. అంటూ అచ్యుత శాస్త్రి వెల్లడించారు.