
Aunty beat the daughter in law
తాజాగా సోషల్ మీడియాలో అత్తా కోడలు మధ్య జరిగిన గొడవ వైరల్ అవుతుంది. అత్త అంటే అమ్మ లాంటిది అంటుంటారు. అలాంటి అత్త కోడలిని ఓ రేంజ్ లో ఉతికి పారేసింది. అత్త ఇంతలా మండిపడిందంటే కోడలు ఏం చేసి ఉంటుందో అని అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది. అసలు విషయంలోకి వెళితే కరీంనగర్ కు చెందిన ఓ యువతి వైద్య సేవల కోసం తన తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్ళింది. వైద్య పరీక్షలు చేస్తుండగా సదరు యువతి అత్తమామలు ఆసుపత్రికి చేరుకున్నారు. కోడలిని ఆసుపత్రి బయటికి తీసుకువచ్చి రాళ్లతో, చీపిరితో దాడి చేశారు.
ఈ ఘటనతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా సద్దుమణగ లేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న వైద్యురాలిపై కూడా దాడి చేశారు. చేతికి దొరికిన వాటితో కొట్టడం ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పినా ఇంకా ఎక్కువ చేశారు. అయితే అక్కడున్న కొంతమంది ఈ వీడియోని చిత్రీకరించారు. అది సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో వైరల్ అయింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. యువతిపై ఎందుకు దాడి చేశారని అత్తమామలను అడిగారు.
Aunty beat the daughter in law
తమ కోడలు మూడు నెలల గర్భిణీ అని, తమకు తెలియకుండా అబార్షన్ చేయించుకుందని వారు కన్నీరు మున్నీరయ్యారు. కోడలిని ప్రశ్నిస్తే తనకు రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి వచ్చానని చెబుతుంది. దీంతో అటు అత్తా మామలని ఇటు కోడలిని సముదాయించారు. దీంతో గొడవ ఆగిపోయింది. అత్తా కోడళ్ళ మధ్య గొడవలు కామన్ గా జరుగుతుంటాయి. కోడళ్లను మానసికగా వేధించే అత్తలు మనకి కనిపిస్తూనే ఉంటారు. అలాగే అత్తలను ఆపసోపాలకు గురి చేసే కోడళ్లు కూడా ఉంటారు. అయితే అందరూ ఒకేలా ఉండరు. తల్లి కూతుర్ల లాగా ఉండే అత్తా కోడలు కూడా ఉంటారు. అలా ఉంటే ఎటువంటి గొడవలు ఉండవు. కానీ సమాజంలో ఇవన్నీ కామన్.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.