Home » News » Auto Ram Prasad Family In Sridevi Drama Company
News

Auto Ram Prasad : ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకే టైపు.. ఆటోలతో రాం ప్రసాద్‌‌కే పిచ్చెక్కించారుగా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 23, 2022, 4:30 pm
Advertisement

Auto Ram Prasad : ఆటో రాం ప్రసాద్ పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే రాం ప్రసాద్ ఫ్యామిలీ మెంబర్లకు కూడా ఆ ఆటో పిచ్చి ఎక్కినట్టుంది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోను వదిలారు. అందులో రాం ప్రసాద్ ఫ్యామిలీ అంతా వచ్చింది. ఇక రాం ప్రసాద్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో శాంపిల్‌గా చూపించారు.ఆటో పంచ్‌లు వేసి అందరినీ విసిగిస్తుంటాడు.

Advertisement

అలాంటి రాం ప్రసాద్‌నే అతని ఫ్యామిలీ మెంబర్లు ఆడేసుకున్నారు. ఏంటిరా బాధగా ఉన్నావ్ అని రాం ప్రసాద్ అడిగితే.. ఏటీఎం కార్డును గీకినా డబ్బులు రావడం లేదు అని అంటాడు ఓ ఫ్యామిలీ మెంబర్. ఎలా గీకావ్ రా అని అంటే.. వేలితో ఇలా గోకాను అని చెబుతాడు. దీంతో షాక్ అవుతాడు రాంప్రసాద్. నీకేంట్రా సుడి ముందుంది అని ఓ పిల్లాడిని అడుగుతాడు.

Auto Ram Prasad Family In Sridevi Drama Company

Advertisement

Sridevi Drama Company : ఆటోని ఆడేసుకున్నారు..

బేసిగ్గా అది వెనుకుండాలి.. కానీ నాన్న కొట్టడంతో ముందుకు వచ్చింది అంటాడు. దీంతో మళ్లీ షాక్ అవుతాడు. నీ జుట్టు ఏంటే రింగులు రింగులుగా ఉందని అడుగుతాడు. రింగు రోడ్డు మీద నుంచి వచ్చాం అందుకే అలా అయిందని ఓ అమ్మాయి అంటుంది. మరీ నీ జుట్టేంటే స్ట్రెయిట్‌గా ఉందని మళ్లీ అడుగుతాడు. రింగు రోడ్డు తరువాత స్ట్రెయిట్ రోడ్డు మీద నుంచి వచ్చాం అందుకే స్ట్రెయిట్ అయిందని అంటుంది. మొత్తానికి ఆటో ఫ్యామిలీ అని అనిపించుకున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి