Black Fungus : బ్లాక్ ఫంగస్ సోకిన వాళ్లకు గుడ్ న్యూస్.. ఆయుర్వేద మందు వచ్చేసింది.. వాడే విధానం ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Fungus : బ్లాక్ ఫంగస్ సోకిన వాళ్లకు గుడ్ న్యూస్.. ఆయుర్వేద మందు వచ్చేసింది.. వాడే విధానం ఇదే..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 May 2021,11:40 am

Black Fungus : ప్రస్తుతం కరోనా కంటే కూడా జనాలు ఎక్కువగా భయపడుతున్నారు బ్లాక్ ఫంగస్ వల్ల. అవును.. కరోనా పాజిటివ్ వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్నాక.. నెగెటివ్ వచ్చిన వాళ్ల మీద బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. మామూలుగా ఈ ఫంగస్ సాధారణ వ్యక్తుల జోలికి పోవడం లేదు. కరోనా ట్రీట్ మెంట్ లో ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడిన వాళ్లపై తన ప్రతాపాన్ని బ్లాక్ ఫంగస్ చూపిస్తోంది. దేశమంతా ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ వ్యాపించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు బోలెడు ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా కేసులు ఎక్కువే ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ కు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స అందించడం లేదు. కేవలం హైదరాబాద్ లోని ఈఎన్టీ ఆసుపత్రి, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో మాత్రమే బ్లాక్ ఫంగస్ కు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

నిజానికి.. బ్లాక్ ఫంగస్ కు సరైన ట్రీట్ మెంట్ లేదు. దానికి ట్రీట్ మెంట్ చేయాలన్నీ.. లక్షలతో కూడుకున్న వ్యవహారం. ఇటువంటి సమయంలో ఆయుర్వేద నిపుణులు బ్లాక్ ఫంగస్ కు ఆయుర్వేదంలో ట్రీట్ మెంట్ ఉందని చెబుతున్నారు. ఏపీలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. బ్లాక్ ఫంగస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. బ్లాక్ ఫంగస్ చికిత్సను ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.

Black Fungus

Black Fungus

Black Fungus : ఆయుర్వేద ట్రీట్ మెంట్ ఇదే

అయితే.. బ్లాక్ ఫంగస్ కు ఆయుర్వేద ట్రీట్ మెంట్ ఉందని.. దాని కోసం ఏం వాడాలో కూడా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దానికి రెండు రకాల చికిత్స విధానాలు ఉంటాయని.. మొదటిది.. గంధక రసాయనం మాత్రలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏ ఆయుర్వేద షాపుకు వెళ్లినా గంధక రసాయనం మాత్రలు దొరుకుతాయని.. వాటిని రోజుకు రెండుసార్లు భోం చేసిన తర్వాత వేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే… ఖదిరాదివతి మాత్రలను భోజనానికి ముందు రోజుకు రెండు సార్లు వేసుకోవాలని చెబుతున్నారు.అలాగే.. పంచతిక్త గుగ్గులువృతాన్ని కూడా వాడాలట. దాన్ని ఓ 10 గ్రాములు తీసుకొని గోరు వెచ్చని పాలలో తీసుకొని.. రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే.. మృత్యుంజయ రసాన్ని కూడా రోజుకు రెండు మాత్రల చొప్పున రోజులో మూడు సార్లు తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే.. ఒక గ్రాము శుభ్రభస్మాన్ని కూడా ఒక గ్లాసు నీటిలో తీసుకొని.. రోజూ పుక్కిలించాలని చెబుతున్నారు.

ayurvedic treatment for black fungus in andhra pradesh

ayurvedic treatment for black fungus in andhra pradesh

అలా కాకుండా.. మరో చికిత్స విధానం కూడా ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యవర్థనీవతి అనే మందును మాత్రల రూపంలో రోజుకు రెండుసార్లు భోజనం చేసిన తర్వాత వేసుకోవాలట. అలాగే.. విషతుందుకవతి రెండు మాత్రం.. రోజుకు మూడు సార్లు భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. ఆ తర్వాత హరిద్రఖండాన్ని 100 గ్రాములు తీసుకొని.. దాంట్లో 10 గ్రాముల మల్లసింధూరాన్ని కలిపి.. తేనె వేసి బాగా కలిపి రోజులో రెండుసార్లు 3 గ్రాముల చొప్పున తీసుకోవాలి. అలాగే టంకణభస్మాన్ని ఒక గ్రాము గ్లాసులో తీసుకొని నీళ్లు పోసి పుక్కిలించి వేయాలి.అయితే.. ఇవి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నప్పటికీ.. బ్లాక్ ఫంగస్ సోకిన వాళ్లు.. ఒకసారి ఆయుర్వేద నిపుణులను సంప్రదించి.. పై చికిత్స విధానాలను వాడితే ఫలితం ఎక్కువగా ఉంటుంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది