Bala Krishna | బ‌న్నీ పాట‌కి బాల‌య్య వేసిన స్టెప్స్ కేక‌.. వీడియో వైర‌ల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bala Krishna | బ‌న్నీ పాట‌కి బాల‌య్య వేసిన స్టెప్స్ కేక‌.. వీడియో వైర‌ల్

 Authored By sandeep | The Telugu News | Updated on :14 August 2025,3:15 pm

Bala Krishna | నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం అఖండ 2. బోయ‌పాటి శ్రీ‌ను ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని 21 ఎక‌రాల్లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించేందుకు భూమిపూజ చేసారు. హైద‌రాబాద్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌కుమించి అనేలా ఈ క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం అయ్యాయి.

అద‌ర‌గొట్టేశాడుగా..

#image_title

ఇక ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉండే బాల‌య్య‌.. పుష్ప పాట‌కి ర‌చ్చ చేశాడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. ఇక బన్నీ అందరినీ అబ్బురపరుస్తూ ‘జాతర’ సాంగ్‌లో గంగమ్మ తల్లి గెటప్‌లో కనిపించాడు. ఆ పాటకు థియేటర్లు ఊగిపోయాయి. బన్నీ చేసిన స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

అయితే, ఇప్పుడు బన్నీ చేసిన ఈ పాటకు మరో స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనదైన స్వాగ్‌తో స్టెప్పులు వేశాడు. మాల్దీవుల్లో ఓ ఫ్యామిలీ సంగీత్‌లో భాగంగా జరిగిన ఈ వేడుకలో బాలయ్య పుష్ప 2 జాతర సాంగ్‌కు చిందులేశారు.ఆయనతో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు నందమూరి ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. పుష్ప పాటకు సింహం డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆహా’లో ‘అన్ స్టాప‌బుల్ విత్ ఎన్బీకే’ కార్య‌క్ర‌మాన్ని దిగ్విజ‌యంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది