Balakrishna : నాన్నని ఎవరు చంపారో తెలుసుకోలేని దద్దమ్మని కాదు.. ఆవేశంలో నోరు జారిన బాలయ్య.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: April 8, 2023, 5:00 pm

Balakrishna : నందమూరి బాలకృష్ణ తెలుసు కదా. ఆయన తెలుగు ఇండస్ట్రీలో రారాజు. తెలుగు ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ ఆయన రాణిస్తున్నారు. తన తండ్రి స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీలోనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో కొనసాగుతున్నారు. కానీ.. పార్టీ పగ్గాలు మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ చేతుల్లో లేవు. అవి నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ చేతుల్లో ఉన్నాయి. అయినా కూడా అదే పార్టీలో బాలయ్య ఉన్నారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటీవల చంద్రబాబు కొడుకు

Nandamuri Balakrishna Biography: Movies, Photos, Videos, News, Biography & Birthday

నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్ర ప్రారంభం అయి రెండు నెలలు దాటింది. ఇప్పటి వరకు కొన్ని వందల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు నారా లోకేశ్. ఆయనకు మద్దతుగా తాజాగా బాలకృష్ణ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సైకో జగన్ ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని బాలకృష్ణ చెప్పారు. యువగళం పాదయాత్ర వెనుక ఉన్న పరమార్థాన్ని, ఫలాన్ని స్వీకరించాలి అని చెప్పారు బాలకృష్ణ. జనంలోనే కాదు.. ఇప్పుడు వైసీపీలోనూ బరస్ట్ అవుతోంది అని చెప్పాలి.

Balayya Tongue Slipped About His Father Sr NTR Incident

Balakrishna : సైకో జగన్ ని వచ్చే ఎన్నికల్లో ఓఢించండి

మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మూడు మనమే గెలుచుకున్నాం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మనం ఒకటి గెలుచుకున్నాం. వైసీపీలో వర్గ పోరు ప్రారంభం అయింది. నేరాల్లో మన రాష్ట్రంలో టాప్ లో ఉంది.. అన్నారు బాలయ్య. అలాగే.. మద్యంతో యూత్ ను బానిసలను చూసి వాళ్లు మాట్లాడుకుండా చేస్తున్నారు. అనాడు ఎన్టీఆర్ గారు ప్రజల కష్టాలు తెలుసుకొని పేదవాడు బాధపడకూడదు అని ఎన్నో కార్యక్రమాలను ప్రారంభించారన్నారు. మీకు ఉన్న ఆయుధం ఓటు మాత్రమే. టీడీపీని అధికారంలోకి తెచ్చుకోండి. లేదంటే మళ్లీ అదే సైకో జగన్ పాలనను చూస్తారు.. అంటూ బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp