FAT | తొడల్లో పేరుకున్న కొవ్వును కరిగించడానికి సులభమైన వ్యాయామాలు .. డైట్ పాటిస్తే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

FAT | తొడల్లో పేరుకున్న కొవ్వును కరిగించడానికి సులభమైన వ్యాయామాలు .. డైట్ పాటిస్తే..

 Authored By sandeep | The Telugu News | Updated on :16 October 2025,8:00 pm

FAT | ఇప్పటి జీవితశైలి కారణంగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం సాధారణం అయ్యింది. ఇవి రుచికరంగా ఉంటాయి, కానీ ఎక్కువకాలంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి. ముఖ్యంగా గుండె, బ్లడ్ ప్రెజర్, షుగర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ కొవ్వు ఎక్కువగా తొడల్లో, పొత్తి కడుపులో నిలుస్తుంది.

#image_title

తొడల్లో కొవ్వు తగ్గించాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలి?

స్క్వాట్స్:
తొడ, హిప్, కోర్ మసిల్స్ చురుకుగా మారేందుకు స్క్వాట్స్ అత్యంత ఉపయోగకరం. చెత్త కండరాలను బలోపేతం చేస్తూ, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మోకాళ్లను వంచి కుర్చీలో కూర్చున్నట్టు భంగిమలో, డంబెల్స్‌తో చేస్తే ఫలితాలు మరింత వేగంగా కనిపిస్తాయి.

లంజెస్:
ఫార్వర్డ్ మరియు సైడ్ లంజెస్ రెండూ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచుతూ, బ్యాలెన్స్ మెరుగుపరుస్తాయి. తొడ మరియు వెనక భాగంలో నిలిచిన కొవ్వు కరిగించడంలో లంజెస్ ఎంతో ఉపయోగపడతాయి.

స్టెప్-అప్స్:
చిన్న బెంచ్ లేదా మెట్లు ఉపయోగించి చేయబడే ఈ వ్యాయామం, కండరాల్లోని కొవ్వుని వేగంగా కరిగిస్తుంది. కేలరీలు ఎక్కువగా ఖర్చు కావడంతో తొడలోని కొవ్వు త్వరగా తగ్గుతుంది.

మరింత ప్రభావం కోసం గమనించవలసిన అంశాలు:

వ్యాయామాలతో పాటుగా సమతులైన ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చక్కెర, అధిక కొవ్వు పదార్థాలు దూరంగా ఉంచాలి.

తగినంత నీరు తీసుకోవడం ముఖ్యము. ఇది మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది.

రోజూ కనీసం 20 నిమిషాలు ఈ వ్యాయామాల కోసం కేటాయించండి. వెంటనే ఫలితాలు రావు, కానీ కొద్ది కాలం తర్వాత కొవ్వు తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంది.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది