Big Breaking : బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ కాంగ్రెస్ లో ఏకంగా 13 మంది సీనియర్ లు రాజీనామాలు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :18 December 2022,5:45 pm

Big Breaking : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత.. సీనియర్ కాంగ్రెస్ నేతలు.. అధిష్టానం నిర్ణయాల పట్ల తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్లు బట్టి విక్రమార్క ఇంటిలో సమావేశమయ్యి.. పీసీసీ కమిటీల ఏర్పాటుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.

అంతేకాకుండా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపై అసత్య ప్రచారం కూడా చేస్తున్నట్లు దాని వెనకాల కూట్ర దాగి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పార్టీలో ఎప్పటినుండో ఉంటున్నా గాని కనీసం క్యాడర్ కి న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు వలస వచ్చిన నాయకులకు పదవులు

Big Breaking resignations started in telangana congress

Big Breaking resignations started in telangana congress

ఇస్తున్నారని సీనియర్ల ఆరోపణలతో టిడిపి నుంచి వచ్చిన నాయకులు రాజీనామా బాట పట్టారు. వేం నరేందర్ రెడ్డి, సీతక్క, ఎర్ర శేఖర్, చారుగొండ సహా పలువురు నేతలు రాజీనామా చేశారు. మొత్తం 13 మంది సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తూ మాణిక్యం ఠాగూర్ కి లేక పంపడం జరిగింది. ఇదిలా ఉంటే రాజీనామాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. నిన్న సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వర్గం ఒక్కసారిగా ఈ రీతిగా రాజీనామాలు చేయటం సంచలనంగా మారింది. ఇన్నాళ్లు అంతర్గతంగా జరిగిన ఈ గొడవలు ఇప్పుడు బయటపడటంతో.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది.

Advertisement

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి