Viral News : ఈ రాయి బరువు కేవలం రూ.50 గ్రాములు... ఖరీదు రూ.850 కోట్లు.. స్మగ్లింగ్ చేస్తుండగా..!
Viral News : జీవితంలో నాలుగు రాళ్లు వెనక వేసుకోమనే సామెత మనం తరుచూ వింటాం. అయితే పెద్దలు చెబుతున్న ఈ మాట అర్ధం ఎంతో కొంత పొదుపు చేయమని. కాకపోతే ఇలాంటి ఒక్క రాయి మీ దగ్గర ఉంటే చాలు.. వందల కోట్ల రూపాయలు ఉన్నట్లే. అలాంటిది ఓ నాలుగు రాళ్లు ఉంటే..మీకు తిరుగు ఉండదు. 50 గ్రాముల ఈ రాయి ఖరీదు ఏకంగా 800 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. ఈ రాయిని కాలిఫోర్నియం అంటారు. దీని విలువ కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుంది. అత్యంత ఖరీదైన ఈ రాయిని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన బిహార్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల కాలిఫోర్నియంను స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ.850 కోట్లు ఉంటుందని అంచనా. దీన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు స్మగ్లర్లును పోలీసులు అరెస్టు చేసినట్లు గోపాల్‌గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ శుక్రవారం తెలిపారు. ఒక్కో గ్రాము విలువ రూ.17 కోట్లు పలుకుతుందని ఆయన వివరించారు. విలువైన రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియంను ముగ్గురు స్మగ్లర్లు తరలిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కుచయ్‌కోట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం బీహార్-ఉత్తరప్రదేశ్-బల్తారీ సరిహద్దులో మోహరించాయి. మోటార్‌బైక్ మీద వస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా కాలిఫోర్నియం దొరికింది. వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్‌లు, 50 గ్రాముల కాలిఫోర్నియం స్వాధీనం చేసుకున్నాం. స్మగ్లర్లు చాలా నెలలుగా విలువైన వస్తువును విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందింది’ అని ప్రభాత్ తెలిపారు. దీనిపై అణు ఇంధన శాఖకు కూడా సమాచారం ఇచ్చామన్నారు.
Viral News : ఈ రాయి బరువు కేవలం రూ.50 గ్రాములు… ఖరీదు రూ.850 కోట్లు.. స్మగ్లింగ్ చేస్తుండగా..!
ఈ కేసులో అరెస్టైన నిందితులను ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లా తమ్‌కుహి రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సౌని బుజుర్గ్ గ్రామానికి చెందిన ఛోటే లాల్ ప్రసాద్ (40), గోపాల్‌గంజ్‌లోని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌశల్య చౌక్, వార్డు నంబర్ 22లో నివాసం ఉంటున్న చందన్ గుప్తా (40), గోపాల్‌గంజ్‌లోని కుషహర్ మథియా నివాసి చందన్ రామ్‌గా పోలీసులు గుర్తించారు. ఇది పర్యావరణంలో సహజంగా లభించే పదార్థం కాదు. ప్రయోగశాలల్లో హెచ్చు పీడనంతో కూడిన ఐసోటోప్ రియాక్టర్లలో దీనిని తయారు చేస్తారు. 1950లో దీన్ని తొలిసారిగా తయారు చేశారు. కాలిఫోర్నియంను భూగర్భంలో బంగారు, వెండి నిల్వల అన్వేషణతోపాటు చమురు, నీటి పొరలను గుర్తించేందుకు వినియోగిస్తారు
RTC Bus Stand : హైదరాబాద్ Hyderabad CIty నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. నగరంలోని ఆరాంఘర్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చారిత్రక చిత్రం hari hara veera mallu హరిహర వీరమల్లు…
Rain Water : శ్రావణమాసం Shravan maas వచ్చేసరికి వర్షాలు భారీగా పెరుగుతాయి అంటే భారీ వర్షాలు కురుస్తాయి. వర్షపు…
Flu Spreading : భారత దేశంలో అంతటా కూడా వాతావరణం లో మార్పులు సంభవించడం చేత ఫ్లూ వ్యాధి కలకలం…
BC Reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ తీవ్ర రాజకీయ…
Eating Rice : మన పెద్దలు తిన్న తర్వాత ఈ పనులు చేయకూడదని చెబుతూనే ఉంటారు. కానీ వాటిని మనం…
Avanthi Srinivas : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా సేవలందించిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు…
Eating Hot Food : వేడివేడి ఆహారాలను తినాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో వేడివేడిగా తినాలని కోరిక ఉంటుంది.…
This website uses cookies.