Midhun Reddy : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బీజేపీ బంపర్ ఆఫర్.. ఏం చేశాడంటే..!
Midhun Reddy : వైసీపీ ఎంపీ, లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఈ మధ్య ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. తనపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని.. తనకు భద్రత తక్కువగా ఉందని ఆయన కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయనకు 4+4 సీఆర్‌పీఎఫ్ సిబ్బంది నిత్యం ఆయనకు భద్రతగా ఉండనున్నారు.వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పుంగనూరులో ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన పుంగనూరులోకి వస్తే చాలు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది.
తాజాగా పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటించినప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వాహనానికి దుండగులు నిప్పు పెట్టారు. అయితే ఇప్పుడు ఆయనకి సెక్యూరిటీ గట్టిగానే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిథున్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్న మిథున్ రెడ్డి..2014లోనే తనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది.. ఏకంగా కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. 2014లో బీజేపీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది..పైగా కూటమిలో నాడు టీడీపీ భాగస్వామిగా ఉంది.
Midhun Reddy : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బీజేపీ బంపర్ ఆఫర్.. ఏం చేశాడంటే..!
ఆ సమయంలో అదీ మొట్ట మొదటి సారి ఎంపీ ఆయిన మిథున్ రెడ్డి చేరిక కోసం బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసిందని వ్యాఖ్యానించడం నమ్మశక్యం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మిథున్ రెడ్డి కొద్ది రోజులక్రితం బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని కానీ, బీజేపీ నుంచి సరైన సిగ్నల్స్ రాలేదనే ప్రచారం జరుగుతుండటం..ఈ ప్రచారాన్ని ఖండించేందుకు ఈ విషయం వెల్లడించడం పట్ల అందరిలో కొత్త అనుమానాలు రేకెత్తేలా చేస్తున్నాయి. తాజా వ్యాఖ్యల ద్వారా తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బీజేపీలో చేరుతానని పరోక్షంగా సంకేతాలు పంపారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
73 Years Old Woman : 73 ఏళ్ల మహిళ కడుపులో 30 ఏళ్లుగా ఉన్న కల్సిఫైడ్ ఫీటస్ను(రాతి బిడ్డ)…
Eat Soaked Dates : ఆధార్నంగా పరగడుపున కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. పదార్థాలలో ఒకటైనది డైట్.…
Toli Ekadashi 2025 : ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది కూడా తొలి ఏకాదశి…
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
This website uses cookies.