పట్టుమని పదిరోజులు కూడా లేదు బంధం? బీజేపీ, జనసేనకు కటీఫ్?
పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీలోని రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి… 2019 ఎన్నికల్లో పోటీ చేయడం.. తర్వాత కొన్ని రోజులు పార్టీలో సైలంట్ అయిపోవడం.. ఇటీవలే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం. తాజాగా బీజేపీతో మళ్లీ అంటీముట్టనట్టే పవన్ ఉంటున్నారు అనేది మరో టాక్.
బీజేపీ, జనసేన పార్టీలు ఒక్కటేనని… భవిష్యత్తులో ఏ విషయంలోనైనా.. ఈ రెండు పార్టీలు ఒకే మార్గంలో నడుస్తాయని బీజేపీకి మద్దతిస్తూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ.. అది ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
దానికి ప్రత్యక్ష ఉదాహరణ.. జీహెచ్ఎంసీ ఎన్నికలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తోందంటూ ప్రకటించారు పవన్. ఆ ప్రకటన వచ్చి రెండురోజులు అయిందో లేదో.. జనసేన ఈ సారి పోటీ చేయడం లేదు… బీజేపీకి మాత్రం మద్దతు ఇస్తుంది అన్నారు. అంటే అక్కడ బీజేపీ నుంచి పవన్ ను ఒత్తిళ్లు వచ్చాయని.. అందుకే జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉపసంహరించుకుందంటూ వార్తలు వచ్చాయి.
కట్ చేస్తే… ఇప్పుడు ఏపీలో తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పోతే పోయింది.. తిరుపతిలో అయినా ఒంటరిగా పోటీ చేసి జనసేన సత్తా చూపించుకోవాలి… అని తెగ ఆరాటపడుతోంది జనసేన పార్టీ. ఎలాగైనా తిరుపతిలో పోటీ చేయాలి.. ఒంటరిగా పోటీ చేసి.. తమ సత్తా చాటాలి అని పవన్ తెగ ఆరాటపడుతున్నారు.
తిరుపతి బరిలో ఎవరు?
అందుకే.. ఇప్పటికే ఆయన నివర్ తుపాను బాధితులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒకరోజు నిరసన చేపట్టారు. దీంట్లో బీజేపీ ఇన్వాల్వ్ మెంట్ ఏం లేదు. జనసేన ఎలాగైతే తిరుపతిలో పోటీ చేయాలని అనుకుంటుందో… బీజేపీ కూడా పోటీ చేయాలని భావిస్తోంది. అదే అక్కడ ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సఖ్యతను దెబ్బతీస్తోంది.
దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి.. మరింత ఉత్సాహంతో బీజేపీ ఉంది. అదే ఉత్సాహంతో తిరుపతి ఉపఎన్నికల్లోనూ గెలిచి… ఏపీలో పాగా వేయాలనేది బీజేపీ ప్లాన్. సేమ్… జనసేన కూడా తిరుపతి ఉపఎన్నికల్లో గెలిచి ఏపీలో తమ సత్తా చాటాలని అనుకుంటోంది.
ఇటువంటి నేపథ్యంలో ఎవరు కాంప్రమైజ్ అవుతారు. ఎవరు అవ్వరు.. అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ.. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ, జనసేన రెండూ వేర్వేరుగా పోటీ చేస్తే.. ఇక రెండు పార్టీలు రాం రాం చెప్పుకున్నట్టే. చూద్దాం.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?