Pawan Kalyan : GVL స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? పవన్ ని డైరెక్ట్ గా అనకుండా ఇన్ డైరెక్ట్ వార్నింగ్?
Pawan Kalyan : టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయినట్టేనా? కొండగట్టులో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తమకు మూడు ఆప్షన్లు ఉన్నాయి అని చెప్పడం వెనుక టీడీపీతో పొత్తే ఉందా? టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కోసమే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారా అనేది అర్థం కావడం లేదు. కానీ.. బీజేపీతో ప్రస్తుతం జనసేన పార్టీ పొత్తుతో ఉంది. మరి.. బీజేపీతో పొత్తు ఉంటుందా? లేక బీజేపీ నుంచే పలువురు జనసేనలోకి చేరుతున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయంపైనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. కావాలని.. బీజేపీని దెబ్బతీయడానికి పొత్తుల పేరు చెబుతున్న వాళ్ల గురించి చెబుతూ ఆయన మండిపడ్డారు. ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. బీజేపీని దెబ్బతీయడానికి పొత్తుల పేర్లు చెబుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. బీజేపీని దూరం పెట్టి.. టీడీపీకి జనసేన దగ్గరవుతున్న వేళ బీజేపీ నేతలు జనసేనపై ఫైర్ అవుతున్నారు. టీడీపీని కూడా టార్గెట్ చేస్తున్నారు.
Pawan Kalyan : అధికారికంగా బీజేపీతో జనసేనకు పొత్తు ఉందా?
అధికారికంగా బీజేపీతో జనసేనకు పొత్తు ఉందని బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అధికారికంగా పొత్తులో ఉన్నప్పటికీ రెండు పార్టీలు కలిసి ఇప్పటి వరకు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఏ పార్టీ తీరు ఆ పార్టీదే అన్నట్టుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. కానీ.. జనసేన మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. తాము ఏ పార్టీతో కలిసి వెళ్తాం అనేది ఎన్నికలకు వారం ముందు తెలుస్తుందని పవన్ కళ్యాణ్ కొండగట్టులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.