Pawan Kalyan : జనసేన పార్టీ పవన్‌ కళ్యాణ్‌ని కంగారు పెడుతున్న బీజేపీ కొత్త వాదన

Pawan Kalyan : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ లోపే పొత్తుల విషయంలో తేల్చాల్సిందే అంటూ జనసేనాని పవన్‌ కళ్యాణ్ అటు బీజేపీ మరియు ఇటు తెలుగు దేశం పార్టీని డిమాండ్‌ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కువ శాతం సొంతంగా ఎన్నికల్లో నిలిచి గెలవాలని అనుకుంటారు. కాని పవన్‌ కళ్యాణ్ మాత్రం గత ఎన్నికల అనుభవమో లేదా మరేంటో కాని పొత్తు పెట్టుకుని అన్నో ఇన్నో సీట్లను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే తెలుగు దేశం పార్టీ తో కలిసేందుకు ఉవ్విల్లూరుతున్నారు.

ఇప్పటికే జనసేన పార్టీకి మరియు బీజేపీకి మద్య పొత్తు ఉంది. ఆ పొత్తు వచ్చే ఎన్నికల వరకు కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం తెలుగు దేశం పార్టీ అయ్యే అవకాశం ఉంది. పవన్‌ కళ్యాణ్‌ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుని జగన్ ను ఢీ కొట్టాలని అనుకుంటున్నారు. పొత్తులు లేకుండా ఎవరి దారిన వారు అంటూ ఇష్టానుసారంగా పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ జగన్ సీఎం అవుతాడు.ఆ విషయం పవన్ కు బాగా తెలుసు. అందుకే జగన్ ను ఓడించాలని పొత్తులు కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

bjp new voice on tdp and Pawan Kalyan tension about next elections

2014 తరహా లో బీజేపీ మరియు తెలుగు దేశంను ఒక్క చోటుకు చేర్చి వారితో జనసేనాని నడవాలని రూట్‌ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాని ఏపీ బీజేపీ నాయకులు మాత్రం అసలు చంద్రబాబు నాయుడును కనీసం కలిసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. చంద్రబాబు నాయుడు వల్లే ఏపీ పరిస్థితి ఇలా అయ్యిందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఆ వ్యాఖ్యలు తెలుగు దేశం మరియు బీజేపీ మద్య మరింత దూరం పెంచేలా ఉన్నాయి. తద్వార జనసేనాని కోరుకున్న పొత్తు చిగురించేలా లేదు అంటూ రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఇదే వాదనతో ఉంటే జనసేనాని రోడ్డు మ్యాప్‌ ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.

Recent Posts

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

2 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

14 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

16 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

20 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

23 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 days ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago