Black Snake | టాయిలెట్ కమోడ్‌లో త్రాచుపాము .. బుసలు కొట్టడంతో పరుగో పరుగు
Black Snake | తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఒక సంఘటన నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఏకంగా టాయిలెట్ కమోడ్‌లో త్రాచుపాము కనిపించి భయంకర దృశ్యం సృష్టించింది. పుష్కర్ నగరాన్ని సందర్శించేందుకు అజ్మీర్ జిల్లా నుంచి వచ్చిన ఓ కుటుంబం, అక్కడి ఓ హోటల్ గదిలో బస చేసింది. ఈ క్రమంలో ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి వాష్‌రూమ్‌కి వెళ్లాడు. టాయిలెట్ కమోడ్‌ను ఓపెన్ చేసి కూర్చోవాలనుకునే సమయంలో… ఆకస్మాత్తుగా లోపల నుంచి పాము బుసలు కొడుతూ కనిపించింది. అది త్రాచుపాము కావడంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

#image_title
తక్షణ చర్యలు ..
ఆ వ్యక్తి వెంటనే గదిలో నుంచి బయటికి వచ్చి విషయం కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు హోటల్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు వెంటనే రాజస్థాన్ కోబ్రా టీమ్‌ను సంప్రదించారు. అతనిది అద్భుతమైన తృటిలో తప్పించుకోగలిగిన ఘటనగా మారింది. ఎందుకంటే అతను చాపకింద నీరులా ఉన్న పామును గమనించకపోతే ఘోర ప్రమాదమే జరిగేది.
పాము, టాయిలెట్ కమోడ్‌లో నుంచి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుని కోబ్రా టీమ్ వచ్చేవరకు గదిని మూసివేశారు. కోబ్రా టీమ్ వచ్చిన అనంతరం ప్రొఫెషనల్‌గా పామును పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెల్లటి వెస్ట్రన్ కమోడ్‌లో నల్లటి త్రాచుపాము బుసలు కొడుతూ ఉండడం వింటే గుండెగుబురు కలిగేలా ఉంది. వీడియోను చూసిన చాలా మంది “ఇక టాయిలెట్ వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడాల్సిందే” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Pushker के एक Hotel कमोड से निकला 5 फीट लंबा Cobra | Ajmer | Cobra Snake | Viral |#Ajmer #Rajasthan #Cobra #CobraSnake #Snake pic.twitter.com/qTPLR6Ubzj
— भारत की बात (@Bharatkebat) September 20, 2025