BREAKING : టీడీపీలోకి రఘురామ కృష్ణం రాజు.. జగన్ చెప్పిందే జరిగిందిగా..!
BREAKING : వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) టీడీపీలో చేరే ముహూర్తం దాదాపు ఖరారు అయినట్టే. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆయన రెబల్ గా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ పార్టీపై, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోనే ఉంటూ కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వైసీపీపై ఆరోపణలు చేస్తూ జాతీయ మీడియాలోనూ ఈయన హైలైట్ అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసి రఘురామ బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ.. రఘురామ బీజేపీలో కాదు.. టీడీపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చంద్రబాబు ఇప్పటికే టికెట్ కూడా కన్ఫమ్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల వేళ ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా సరే.. కాకినాడ నుంచి రఘురామనే పోటీలో నిలపాలని చంద్రబాబు యోచిస్తున్నారట.
దాని కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని రఘురామ కృష్ణంరాజుకు చంద్రబాబు సూచించారట. నిజానికి కాకినాడలో టీడీపీ బలమే ఎక్కువ. ప్రస్తుతం జనసేన కూడా కాస్త దూకుడు మీదనే ఉన్నది. 1998 లో కాకినాడ నుంచే పోటీ చేసి రఘురామ కృష్ణంరాజు గెలిచిన విషయం తెలిసిందే. అందుకే.. కాకినాడ నుంచి మరోసారి రఘురామను పోటీలోకి దించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. చంద్రబాబు చేయించిన సర్వేల్లోనూ కాకినాడలో రఘురామను బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిశాయట. అందుకే కాకినాడ టికెట్ ను చంద్రబాబు రఘురామకు కన్ఫమ్ చేశారట.
BREAKING : కాకినాడలో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన రఘురామ
అయితే.. రఘురామ ఇప్పటికే కాకినాడలో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నరసాపురం ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో నరసాపురం నుంచి కాకినాడకు షిఫ్ట్ అవ్వాలని రఘురామ భావిస్తున్నారట. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అక్కడ వ్యూహాలు రచించాలని భావిస్తున్నారట. రఘురామ కాకినాడలో పోటీ చేస్తే గెలవడం కూడా పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి ఉన్న పట్టు వల్ల, రఘురామకు ఉన్న పాపులారిటీ వల్ల కాకినాడలో ఆయన విజయం సునాయసమే అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి.. రఘురామ భవిష్యత్తు టీడీపలో ఎలా ఉండబోతోందో?