Viral Video : పెళ్లి పీటల మీదే పెళ్లి కూతురు చేసిన పనికి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 June 2021,6:19 pm

Viral Video : పెళ్లి అనేది మనిషి జీవితంలో ఒకేసారి జరిగే తంతు. పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ వేడుకను బాగా జరుపుకోవాలని.. ఘనంగా జరుపుకొని.. అందరూ కోరుకుంటారు. తమ పెళ్లి రోజును, పెళ్లి రోజు జరిగిన ఘటనలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. అందుకే.. పెళ్లి రోజున పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ రోజు వాళ్ల ఆనందాలకు అవధులే ఉండవు. కానీ.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం చాలా విచిత్రమైన ఘటన. పెళ్లి రోజున పెళ్లి పీటల మీద.. పెళ్లి కూతురు చేసిన హడావుడి చూస్తే మీరు షాక్ కు గురవుతారు.

bride attitude funny viral video

bride attitude funny viral video

అయితే.. కొందరికి ఇష్టం లేకుండా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. అమ్మాయికి ఇష్టం లేకుండా కొన్ని జరుగుతాయి. అబ్బాయికి ఇష్టం లేకుండా మరికొన్ని జరుగుతాయి. ఇద్దరిలో ఎవ్వరికి ఇష్టం లేకున్నా.. పెళ్లి కళ వాళ్లలో అంతగా కనిపించదు. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అటువంటిదే. పెళ్లి కూతురుకు అస్సలు పెళ్లంటే ఇష్టం లేదు కావచ్చు. అందుకే.. తను పెళ్లి పీటల మీద ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Viral Video : స్వీట్ తినిపించమంటే.. వధువు ఏం చేసిందంటే?

పెళ్లిలో ఎవరి సాంప్రదాయాలు వారివి. ఎవరి ఆచారం వారిది. ఒక్కొక్కరి ఆచారం ఒక్కో తీరుగా ఉంటుంది. పెళ్లిని వివిధ రకాలుగా జరుపుకుంటారు. వీళ్ల పెళ్లిలో ముందు స్వీట్లను తినిపించుకొని నోరును తీపి చేసుకోవాలి. ఆ తర్వాత వధూవరులు ఇద్దరూ పూలదండలను మార్చుకోవాల్సి ఉంటుంది. ముందు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు స్వీట్ తినిపించాలి. దీంతో అందరూ పెళ్లి కూతురును పెళ్లి కొడుకుకు స్వీట్ తినిపించాలంటూ కోరారు. దీంతో తను స్వీట్ తీసుకొని పెళ్లి కొడుకు నోరు దగ్గర పెట్టింది. పెళ్లి కొడుకు మాత్రం ఆ స్వీట్ ను తినకుండా.. అలాగే చూస్తున్నాడు. దీంతో కోపం వచ్చిన పెళ్లి కూతురు స్వీట్ ను పెళ్లి కొడుకుకు తినిపించకుండా విసిరేసింది. తన ప్రవర్తనకు అక్కడున్న వాళ్లంతా షాక్ కు గురయ్యారు. పెళ్లి కొడుకు అయితే.. దెబ్బకు దడుసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే.. ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి