BRS Sarpach Navya : పెట్రోల్ పోసి తగులబెడతా.. రాజయ్య ముందే బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BRS Sarpach Navya : పెట్రోల్ పోసి తగులబెడతా.. రాజయ్య ముందే బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య సంచలన వ్యాఖ్యలు

 Authored By kranthi | The Telugu News | Updated on :13 March 2023,9:00 am

BRS Sarpach Navya : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఘటన బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య ఇష్యూ. ఆమె జనగామ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచ్. ఇటీవల.. తనపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మీడియా ముందు వాపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజయ్య తనను చాలా వేధిస్తున్నారని.. నిధులు కావాలంటే ఒంటరిగా రమ్మంటున్నారని ఆమె ఆరోపణలు చేశారు. మీటింగ్ లలో, సమావేశాల్లో తనపై చాలాసార్లు అసభ్యంగా ప్రవర్తించారని, తాను ఆయన్ను ఒక తండ్రిలా భావించానని కానీ.. ఆయన మాత్రం తనను లైంగికంగా

brs sarpanch navya fires on mla rajaiah

brs sarpanch navya fires on mla rajaiah

వేధించారని నవ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం బీఆర్ఎస్ పెద్దలకు చేరడం, వెంటనే రాజయ్యపై పెద్దలు సీరియస్ అవడంతో వెంటనే జానకిపురం వచ్చి నవ్యకు రాజయ్య సారీ చెప్పారు. ఆ తర్వాత రాజయ్యతో కలిసి నవ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. మరోసారి నవ్య ప్రెస్ మీట్ పెట్టి మా ఊరిని ఎందుకు డెవలప్ చేయరు అని ఎమ్మెల్యే రాజయ్యను ప్రశ్నించారు. సమాజంలో జరిగే అన్యాయాల గురించి చెబుతున్నా.. సమాజంలో జరిగే అక్రమాల గురించి చెబుతున్నా. మూడు రోజుల నుంచి నన్ను చాలా మంది అడుగుతున్నారు. అన్యాయంగా అరాచకాలు సృష్టిస్తే, మాకు నిధులు ఇవ్వకపోతే కిరోసిన్ పోసి తగులబెట్టే నాలాంటి వందలాది ఆడవాళ్లు పుట్టుకొస్తారు అంటూ ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

BRS Sarpach Navya : రాజయ్య ముందే ప్రెస్ మీట్ లో నవ్య సంచలన వ్యాఖ్యలు

ఎవరో ఏదో అన్నారని ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరి అణచివేతలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరి వల్ల మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మా గ్రామానికి ఏం చేస్తారో చెప్పాలి. ఇప్పటి వరకు మా గ్రామం నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోలేదు. మీరు ఏం చేస్తారో మీడియా ముందే చెప్పాలి. నా పదవి కూడా 8 నెలలే ఉంది. మీరు మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పాలి. మాకు ఎలాంటి సమస్య వచ్చినా మీరే ముందుండి చూసుకోవాలి అని ఆమె ఆయన్ను కోరారు.

YouTube video

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది